Thursday, July 4, 2024
HomeతెలంగాణKarimnagar: 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సరస్వతి శిశు మందిర్

Karimnagar: 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సరస్వతి శిశు మందిర్

పాఠశాల దశ నుండే ప్రపంచ స్థాయి విషయాలపై, గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకున్నాం

కరీంనగర్ శ్రీ సరస్వతి శిశు మందిర్ ఉన్నత పాఠశాల 1997-98 విద్యార్థులు 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నగరంలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన నాటి ఉపాధ్యాయులను విద్యార్థులు సత్కరించుకున్నారు. కార్యక్రమానికి హాజరైన విద్యార్థులు పాఠశాల అనుభవాలను ఉపాధ్యాయులతో ఏర్పరచుకున్న అనుబంధాన్ని గడిచిన రోజులను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు మాట్లాడుతూ, ప్రతి విద్యార్థికి ఆత్మ విశ్వాసం అవసరం, సదాచారం అనే ప్రత్యేక తరగతి ద్వారా హిందూ ధర్మం, ఆచారం, సంస్కృతి సంప్రదాయాలు, వినయం విధేయత తో పాటు స్వదేశీ వస్తువుల వినియోగం పై అవగాహన అవసరం ఎంత అవసరమో తెలుసుకున్నామన్నారు.

- Advertisement -

నాడు ప్రతి శనివారం నిర్వహించే శిశు భారతి కార్యక్రమం ద్వారా విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యాన్ని వెలికితీసే ప్రయత్నం, స్ఫూర్తి దినపత్రిక ద్వారా పాఠశాల దశ నుండే ప్రపంచ స్థాయి విషయాలపై, గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకున్నాము, ప్రతిరోజు ప్రార్ధన సమయంలో ఆరోజు దినపత్రికల సమాచారాన్ని చదివి చెప్పడం వలన బయట ప్రపంచంపై విద్యార్థులకు అవగాహన కల్పించడం, తరగతి గదులు ముసిన తర్వాత సాయంత్రం వేళలో సూర్యనమస్కారాలు చేపించడం వలన విద్యార్థులకు శారీరక దృఢత్వాన్ని కల్పించడం ఒక మంచి విషయం, నేటి ఈ ఆధునిక కాలంలో సరస్వతి శిషుమందిర్ పాఠశాల కార్పొరేట్ స్థాయిలో రూపు దిద్దుకోవలసిన అవసరం ఉందని, అయితే సరస్వతి మాత ఆశీర్వచనాలతో ఇపుడు అది ఆచరణకు నోచుకుంటుందని దాదాపు 30 కోట్ల రూపాయలతో నూతన పాఠశాల నిర్మాణం జరుగుతుండడం, అందుకు సంబంధించిన పనులు ప్రారంభం అవడం నిజంగా హర్షించదగ్గ విషయమని అన్నారు.

పవిత్రమైన విద్యా వృత్తి బోధించడం అందరివల్ల కాదు. రాయిని దెబ్బలు కొట్టగా కొట్టగా అది శిల్పంగా ఎలా మారుతుందో ఒక్కో తరగతి గదిలో ఒక్కో వ్యక్తిత్వం, మనస్తత్వాలు కలిగిన విద్యార్థులకు ఎంతో ఓపికగా చదువు చెప్పి వారిని తీర్చిదిద్దే వారే గురువులని, వారి ద్వారానే నేడు విద్యార్థులు అన్ని రంగాలలో రాణిస్తున్నారని, అలాంటి గురువులను ఇలాంటి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాల ద్వారా సత్కరించుకోవడం అదృష్టం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రధాన ఆచార్యులు పుల్లూరి రామారావు, రాజమౌళి, శంకరాచార్యులు, ఆచార్యులు శ్రీమతి పద్మ, మాతాజీ, దేవేందర్ రెడ్డి, శ్రీధర్, దాశరథి, విజేందర్ రెడ్డి, విద్యార్థులు నందాల ప్రశాంత్, దొంతి గోపి, కొమురవెల్లి మహేష్, మడిశెట్టి ప్రదీప్, చిదుర మహేష్, కాంచన పెళ్లి వేణుగోపాల్, గోటికారి శశి కాంత్, శ్రీరాముల సంజీవ్, మహిళా విద్యార్థులు శశికళ, గంట సులోచన, కాచం సరిత, గూడూరు శ్రీలత, కాచం వీరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News