Friday, September 20, 2024
HomeతెలంగాణKarimnagar: 8 రోజుల స్పెషల్ శానిటేషన్ డ్రైవ్

Karimnagar: 8 రోజుల స్పెషల్ శానిటేషన్ డ్రైవ్

ప్రభుత్వం ఆదేశించిన ప్రకారం కరీంనగర్ నగరంలో శనివారం నుండి స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ పనులను సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులు, సిబ్బందిని కరీంనగర్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు ఆదేశించారు. కరీంనగర్ నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం రోజు మేయర్ యాదగిరి సునీల్ రావు, నగరపాలక సంస్థ కమిషనర్ సేవా ఇస్లావత్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, సానిటేషన్ అధికారులు, సిబ్బందితో మేయర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు నగరంలో చేపట్టే ప్రత్యేక పారిశుధ్య పనులపై అధికారులకు సలహాలు సూచనలు చేసి పలు ఆదేశాలు జారీ చేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా మేయర్ యాదగిరి సునీల్ రావు మాట్లాడుతూ కరీంనగర్ నగరంలో పారిశుధ్య పనులను మరింత మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. రేపటి నుండి 8 రోజుల పాటు ప్రతి డివిజన్ లో స్పెషల్ సానిటేషన్ డ్రైవ్ ను విజయవంతంగా కొనసాగించాలన్నారు. మొదటగా కార్పొరేటర్ల సహాకారంతో డివిజన్ల వారీగా డివిజన్ కమిటీ సమావేశాలు నిర్వహించుకొని డివిజన్ లో ఉన్న సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించుకోవాలన్నారు. 8 రోజుల పాటు డోర్ టూ డోర్ 100 శాతం చెత్త సేకరణ, సెగ్రిగేషన్, నగరంలోని రోడ్లు, డివిజన్ల వారీగా రోడ్లను శుభ్రం చేయడంతో పాటు డెబ్రీస్ తొలగింపు, డ్రైనేజీలలో సిల్ట్ తొలగింపు పనులు ముమ్మరం చేయాలన్నారు. ఎక్కడైనా వర్షపు నీరు రోడ్లపైకి వచ్చే సమస్యలు ఉంటే ముందుగానే గుర్తించి వాటిని పరిష్కరించాలన్నారు.

డ్రైనేజీలలో పైపులైన్ లు ఉంటే వాటిని కూడా గుర్తించి సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. వాటికి సంబంధించి అన్ని రిపోర్టులు అందించాలని కోరారు. వర్షాకాలం రాబోతోందని, కాబట్టి శిథిలావస్థలో ఉన్న ఇండ్లను గుర్తించి ముందస్తు చర్యగా వారికి నోటీసులు ఇచ్చి వర్షకాలం ముగిసే వరకు వారిని ప్రత్యామ్నాయ చోటులో ఉండాలని సూచించాలన్నారు. పూర్తిగా కూలీపోయే స్తితిలో ఉంటే వాటిని తొలగించాలని ఆదేశించారు. అలాంటి ప్రదేశాల్లో సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడా ప్రమాదం జరగకుండా జవానులు, ఇన్ స్పెక్టర్ లు, అధికారులు భాద్యత వహించాలన్నారు. డీ సిల్టింగ్ పనుల్లో ఎక్కడ లోపం లేకుండా అధికారులు భాద్యత వహించాలన్నారు. ప్రధానంగా డ్రైనేజీ నిర్మాణం పనులు జరిగే చోట డైవర్షన్ తీసుకున్న వాటిని మరిచిపోకుండా జాగ్రత్త వహించాలన్నారు. అక్కడక్కడ కల్వర్టు పనులు ఉంటే వాటిని పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

డ్రైనేజీ పనులు వేగవంతంగా పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మేరీ లైఫ్, మేరా స్వచ్చ్ షెహర్ పనులు కూడా స్పెషల్ డ్రైవ్ తో పాటు కొనసాగాలని ఆదేశించారు. స్పెషల్ డ్రైవ్ పనుల్లో సానిటేషన్ పరంగా చేసే పనులన్నీ 8 రోజుల పాటు చేయాలని, ఎక్కడ నిర్లక్ష్యం వహించినా అధికారులు, సిబ్బందిపై చర్యలు తప్పవన్నారు. ప్రతిరోజు ఉదయం నుండే డివిజన్ ప్రజల, వార్డు కమిటీ సభ్యుల భాగస్వామ్యంతో డివిజన్ లలో పారిశుధ్య సమస్యలన్నీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సమావేశం లో డిప్యూటీ కమిషనర్ త్రియంభకేశ్వర్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్, సానిటేషన్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News