Saturday, October 12, 2024
HomeతెలంగాణKarimnagar: అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా కుమార స్వామి గౌడ్

Karimnagar: అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా కుమార స్వామి గౌడ్

మొదటి అదనపు జిల్లా కోర్టుకు ..

కరీంనగర్ బార్ అసోసియేషన్ కు చెందిన సీనియర్ న్యాయవాది. పంజాల కుమార స్వామిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్ మొదటి అదనపు జిల్లా కోర్టుకు ఆడిషనల్ పబ్లిక్ సిక్యూటర్ ను నియమించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఉత్తర్వులు జారీ చేశారు. అక్కన్నపేట్ మండలం అంతక్ పేట్ గ్రామంలోని గౌడ కుటుంబం నుంచి వచ్చిన కుమార స్వామి 2006 లో న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించి పలు సివిల్, క్రిమినల్ కేసులు వాదించారు.

- Advertisement -

ఈయన మూడు సంవత్సరాల పాటు పోలీస్ డిపార్ట్మెంట్ తరపున నమోదైన పలు క్రిమినల్ (పొక్సో కేసులను) వాదించనున్నారు. తన నియామకానికి సహకరించిన రాష్ట్ర బిసి సంక్షేమ, రోడ్ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, కాంగ్రెస్ రాష్ట్ర లీగల్ సెల్ అద్యక్షులు పొన్నం అశోక్ గౌడ్ లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియామకమైన కుమార స్వామిని కరీంనగర్ బార్ ఆసోసియేషన్ అద్యక్షులు పివి రాజ్ కుమార్, కాంగ్రెస్ లీగల్ సెల్ బాధ్యులు ఆర్ దేవేందర్ రెడ్డి, కల్లేపల్లి లక్ష్మయ్య అభినందించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News