Friday, November 22, 2024
HomeతెలంగాణKarimnagar: అక్షర హై స్కూల్ 14వ వార్షికోత్సవాలు

Karimnagar: అక్షర హై స్కూల్ 14వ వార్షికోత్సవాలు

అట్టహాసంగా..

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గోపాల్ రావు పేట అక్షర హై స్కూల్ 14వ వార్షికోత్సవం-యుపోరియా వేడుకలు అట్టహాసంగా జరిగాయి. వార్షికోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా చొప్పదండి ఎమ్మెల్యే డాక్టర్ మేడిపెల్లి సత్యం, గెస్ట్ ఆఫ్ హానర్ గా ట్రాస్మా రాస్ట్ర అధ్యక్షులు యాదగిరి శేకర్ రావు, ప్రత్యేక విశిస్ట అతిథిగా లయన్ కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి , గోపాల్రావుపేట మాజీ సర్పంచ్ కర్ర సత్య ప్రసన్నారెడ్డి, బీసీ సెల్ అధ్యక్షులు పులి ఆంజనేయులు గౌడ్, కర్ర అశోక్ రెడ్డి హాజరయ్యారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మేడిపెల్లి సత్యం విద్యార్థలను ఉద్దేశించి మాట్లాడుతూ…..మంచి ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకుని నిత్యం కష్టపడుతూ అమ్మానాన్నల కలలను సాకారం చేయాలని, అందుకు ఉదాహరణగా ఇటీవల ఐఏఎస్ గా ఎంపికైనా వెలిచాల గ్రామానికి చెందిన సాయికిరణ్ విజయగాథ ను ఉదాహరణ గా విద్యార్థులకు సూచించారు. పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు బాగున్నాయని ప్రశ్నించారు.

ట్రాస్మా రాష్ట్ర అధ్యక్షులు యాదగిరి శేఖర్ రావు మాట్లాడుతూ… విద్యార్థులు గ్రామీణ ప్రాంతమైనప్పటికీ చాలా చక్కని ఇంగ్లిష్ మాట్లాడుతూ ప్రతిభను కనపర్చుతున్నారనీ, అక్షర స్కూల్ 14 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం చాలా సంతోషమని, పిల్లలు అమ్మానాన్నల కు విలువ ఇవ్వాలని, పెడదారి పట్టకుండా ఎప్పడు తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని, వారితో కలిసి రోజూ ఒక గంటైనా టైం కేటాయించాలని, ఆడపిల్లలకు తప్పకుండా వంట నేర్పించాలని అన్నారు.

లయన్ కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ… మొబైల్ ఫోన్ వల్ల కలిగే అనర్థాలు, అమ్మానాన్నల పిల్లల మధ్య ఉండే అనుబంధం నేడు ఉండాలో, నవ సమాజ నిర్మాణములో విద్యార్థుల పాత్ర, కష్టపడితే ఎలా గొప్పవాళ్లు అవుతారో చక్కని ఉదాహరణలతో వివరించారు.


బీసీ సెల్ అధ్యక్షులు ప్రత్యేక అతిథి పులి అంజనేయులు గౌడ్ విద్యతో పాటు క్రీడల ప్రాముఖ్యాన్ని చక్కాగా వివరించారు విద్యార్థులకు మేమోన్టోస్, సర్టిఫికేట్ లు అందించారు.

ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, తల్లిదండ్రులు, విద్యార్థులు, కరస్పాండెంట్ మిణుకుల మునీందర్, ప్రిన్సిపల్ మిణుకుల రాధ, ఉపాద్యాయ బృందం, నాన్ టీచింగ్ బృందం తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News