మహిళా సాధికారత, రక్షణతో కూడిన భారత దేశాన్ని గురించి చాటేందుకు సైకిల్ యాత్ర చేపట్టిన సైక్లిస్ట్ ఆశ మాల్వియా కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడును కలిశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ ఆమెను అభినందించారు. మధ్యప్రదేశ్ కు చెందిన సైక్లిస్ట్ ఆశ మాల్వియా గత నవంబర్ 1న గుజరాత్ నుండి యాత్రను ప్రారంభించారు. ఇప్పటివరకు ఆమె 9 రాష్ట్రాల్లో పర్యటించారు. ఈ సైకిల్ యాత్ర సెప్టెంబర్ 29న ఢిల్లీలో ముగియనుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆమె పర్యటించనున్నారు. ఈ పర్యటన సందర్భంగా ఎదురైనా అనుభవాలను సీపీకి వెల్లడించారు. మహిళా సాధికారత, రక్షణతో కూడిన దేశ నిర్మాణంలో భాగంగా అవగాహన కల్పించేందుకు సైకిల్ యాత్ర చేపట్టానన్నారు ఆశా. బాలికలు వారి లక్ష్యం కచ్చితంగా నిర్దేశించుకోవాలని, సమస్యలు ఆ లక్ష్యం ముందు చాలా చిన్నవని చెప్పారు.