Saturday, November 23, 2024
HomeతెలంగాణKarimnagar: ఆర్మీ రిక్రూట్మెంట్ ను సద్వినియోగం చేసుకోండి

Karimnagar: ఆర్మీ రిక్రూట్మెంట్ ను సద్వినియోగం చేసుకోండి

ఇండియన్ ఆర్మీలో చేరాలనుకునే యువతీ, యువకులు ఆర్మీ రిక్రూట్మెంట్ ను సద్వినియోగం చేసుకోవాలని సికింద్రబాద్ ఆర్మీరిక్రూట్ మెంట్ డైరెక్టర్ కిట్స్ కె దాస్ తెలిపారు. భారత సైన్యంలో అగ్నివీర్, నర్సింగ్, వివిధ విభాగాలలో సేవలను అందించడానికి 2023 ఇండియన్ ఆర్మీరిక్రూట్ మెంట్ ను నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నట్టు వెల్లడించారు. గతంలో ఆర్మీ రిక్రూట్ మెంట్ లో మొదట శారీరక పరీక్షలను అనంతరం వ్రాతపరీక్షలను నిర్వహించినట్టు.. కానీ ఇప్పటి నుండి నూతన విధానాన్ని అవలంభిస్తామని ఆయన తెలిపారు.

- Advertisement -

మొదట కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ (వ్రాత పరీక్షను) ఆన్లైన్ ద్వారా నిర్వహించి, అందులో ఉతీర్ణులైన వారికి తరువాత ఫిజికల్ ఫిట్నెస్ టెస్టులను ఆతరువాత నిర్వహిస్తామన్నారు. ఆసక్తి ఉన్న యువతీ యువకులు మార్చీ 15 లోగా www.joinindianarmy.nic.in అనే వెబ్ సైట్ ద్వారా సమర్పించాలని సూచించారు.

దరఖాస్తులో ఆధార్ కార్డ్ వివరాల నమోదును తప్పనిసరి అని, దాని ద్వారా రిజిస్టర్ మొబైల్ నెంబరుకు ఒటీపీని పంపించనున్నట్టు తెలిపారు. 10వ తరగతి నుండి ఆ పై తరగతులు ఉతీర్ణులైన వారిలో 17నుండి 21 సంవత్సరాల వయసు గల వారు అర్హులని, రిక్రూట్ మెంట్ లో 10వ తరగతితో పాటు డిప్లమా లేదా ఆ పై తరగతులను పూర్తి చేసిన వారికి మరిన్ని ఎక్కువ అవకాశాలను కల్పిస్తారని తెలిపారు.

ఆర్మీ రిక్రూట్ మెంట్ ను హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ మరియు ఖమ్మం జిల్లాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసి నిర్వహించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. అభ్యర్థుల సందేహాల నివృత్తి చేసేందుకు హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేసినట్టు, ఎగ్జామ్ సంబంధించిన సందేహాలకు 7996157222 కు కాల్ చేయవచ్చని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News