Sunday, November 16, 2025
HomeతెలంగాణKarimnagar: డ్రోన్ల వినియోగంపై నిషేధాజ్ఞలు

Karimnagar: డ్రోన్ల వినియోగంపై నిషేధాజ్ఞలు

కరీంనగర్ కమీషనరేట్ పరిధిలో భద్రత కారణాల దృష్ట్యా పారాగ్లైడర్స్, రిమోట్ కంట్రోల్ డ్రోన్స్, రిమోట్ కంట్రోల్ మైక్రోలైట్ ఏయిర్ క్రాఫ్ట్ ల వినియోగాన్ని నిషేధించినట్టు కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. ఈ నిషేధాజ్ఞలు ఈనెల 15వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.

- Advertisement -

సాంకేతిక పరికరాలను ఈ మధ్యకాలంలో వివాహాది శుభకార్యాలు, వివిధ కార్యక్రమాల సందర్భంగా వినియోగిస్తున్నారనని ఆయన అన్నారు. ఉగ్రవాదులు, అసాంఘికశక్తులు వీటిని వినియోగించే అవకాశాలుండటంతో సదరు సాంకేతిక పరికరాల వినియోగాన్ని నిషేధించినట్టు సుబ్బరాయుడు వివరించారు. ఎవరైనా ఇలాంటి డ్రోన్స్ వినియోగించదలచినట్లైతే సంబంధిత పోలీసుల అనుమతి తీసుకోవాలన్నారు. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఐపిసి సెక్షన్ 188 ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad