Friday, September 20, 2024
HomeతెలంగాణKarimnagar: పనులు పూర్తైనా ప్రారంభానికి నోచుకోని వంతెన!

Karimnagar: పనులు పూర్తైనా ప్రారంభానికి నోచుకోని వంతెన!

ప్రమాదాలు జరిగితేనే స్పందిస్తారా ?

కరీంనగర్ జిల్లా రామడుగు మండల పరిధిలో నూతనంగా నిర్మించిన వంతెన ప్రారంభానికి నోచుకోక ప్రయాణికులను పాలకులను వెక్కిరిస్తోంది. కోట్లాది రూపాయల ప్రజాధనంతో బ్రిడ్జి నిర్మించినప్పటికీ అధికారుల అలసత్వంతో అది అలంకారప్రాయంగా మారింది. దొడ్డిదారిన కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని కొట్టేయాడానికి పన్నిన పన్నాగం స్థానిక ప్రజలకు శాపంగా మారి వంతెన ప్రారంభానికి నోచుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వంతెన నిర్మాణానికి భూసేకరణ చేసిన పిదప పనులు ప్రారంభించాల్సిన అధికారులు దురుద్దేశంతోనే భూసేకరణ చేయకుండా వంతెన నిర్మాణం చేపట్టడంతో నిర్మాణం పూర్తయినా అలంకార ప్రాయంగా ఉండాల్సిన దుస్థితి నెలకొంది.

- Advertisement -

భూసేకరణ చేయకుండానే..
వెదిర ఎక్స్ రోడ్డు నుండి రామడుగు మండలం గుండి వెళ్లే రహదారిపై పురాతన వంతెన శిథిలావస్థకు చేరుకోవడంతో 2019 ఫిబ్రవరి నెలలో అప్పటి ప్రభుత్వం రూ,7 కోట్ల 90 లక్షలతో వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. అయితే ముందస్తుగా భూసేకరణ చేయాల్సిన అదికారులు కుట్ర పూరితంగానే బ్రిడ్జి నిర్మాణ పనులను మొదలుపెట్టారనే ఆరోపణలు ఉన్నాయి. బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే భూ నిర్వాసితులకు అడిగినంత ఇవ్వడానికి అవకాశం ఉంటుందని భావించిన అధికారులు బ్రిడ్జి నిర్మాణ పనులు ముందుగా చేసి భూసేకర జాప్యం చేశారని భూ సేకరణ పూర్తయితే అది వినియోగంలోకి రావాలంటే భూ సేకరణ ఎలాగైన జరపాల్సిందే. దీంతో ప్రభుత్వం భూ బాధితుల డిమాండ్ తలొగ్గుతుంది. అందుకు ఎక్కువ మొత్తంలో అంచనాలు పంపించి బాధితులకు పరిహారం ఇప్పించి మూడో కంటికి తెలవకుండ తమ వాటా తాము తీసుకునేందుకు భూ యజమానులతో కలిసి చేసిన కుట్ర ఫలితమే నేడు బ్రిడ్జి ప్రారంభానికి నోచుకోకపోవడానికి ప్రధాన కారణమని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


ప్రమాదాలు జరిగితేనే స్పందిస్తారా?
వంతెన పనులు నిలిచిపోవడానికి ప్రధాన కారణం అంచనా విలువ పెరగడమే అని స్థానికులు ఆరోపిస్తున్నారు. వంతెన నిర్మాణం పనులు మధ్యలో నిలిచిపోవడంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని.. ప్రాణాలు అరచేతిలో పట్టుకొని ప్రయాణించే పరిస్థితి దాపురించిందని స్థానికులు పాలకులపై మండిపడుతున్నారు. రామడుగు మండల కేంద్రం నుండి దాదాపు జిల్లాలను కలుపుకొని నాలుగు ఐదు ప్రజలు రాకపోకలు ఈ వంతెన పై నుండి నిత్యం కొనసాగుతున్నప్పటికీ పురాతన వంతెన పూర్తిస్థాయిలో శిథిలమై ప్రమాదకరంగా మారినా తాత్కాలిక మరమ్మత్తులు చేపట్టకపోవడంతో అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరిగితే కానీ స్పందించరా అంటూ ప్రశ్నిస్తున్నారు.
1.30 గుంటలకు పరిహారం రూ.2 కోట్లు?


భూ నిర్వాసితులకు ఇచ్చే నష్టపరిహారం అంచన వేయడంలో అధికారులు వాస్తవానికి విరుద్ధంగా కోట్ల రూపాయలు అంచన వేసి పంపడం బ్రిడ్జి ప్రారంభానికి అడ్డంకిగా మారింది. ఉమ్మడి జిల్లాలో భూ సేకరణ చేసిన అధికారులు గతంలో ఏ ప్రాజెక్టులో ఈ స్థాయిలో నష్ట పరిహారం చెల్లించకపోవడంతో అనుమానం వచ్చి నష్ట పరిహారాన్ని పెండింగ్ లో పెట్టారని.. ఈ విషయం స్థానికంగా ప్రచారం జరిగి వివాదాస్పదంగా మారింది. దీంతో పలు ప్రజా సంఘాలు అధికారుల తీరును ఖండిస్తు ఆందోళనలు చేసి నిరసనలు తెలిపాయి.
అక్రమ అంచనా వెనుక ఉన్నదెవరు?
పెద్ద మొత్తంలో అంచనా విలువలు వేయడంలో తెరవెనుక ఉన్నది ఎవరనేది స్థానికంగా చర్చ జరుగుతోంది. కొంత మంది స్వార్థంతో ఎక్కువ మొత్తంలో లబ్ది పొందేందుకు చేసిన కుట్ర ఆ ప్రాంత ప్రజలకు శాపంగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నూతనంగా నిర్మాణం చేసిన వంతెన ప్రారంభించకపోవడంతో శిథిలావస్థకు చేరుకున్న వంతెన పైనుంచే ప్రయాణం చేయవలసి వస్తుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News