Friday, April 4, 2025
HomeతెలంగాణKarimnagar: జీవో 333 రద్దు చేయాలి

Karimnagar: జీవో 333 రద్దు చేయాలి

జీవో 333 రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి అజయ్ ప్రజావాణిలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజురోజుకూ ఎండలు పెరుగుతున్నాయని, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పని గంటలు తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. పనిచేస్తున్న కార్మికులందరికీ రోజుకు 600 రూపాయలు ఇవ్వాలని, 200 రోజులు పని దినాలు కల్పించాలని కోరారు. అదే విధంగా కేరళ మాదిరిగా మున్సిపాలిటీలలో ఉపాధి హామీ పని కల్పించాలన్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరారు.

- Advertisement -

పని ప్రదేశంలో టెంటు, మంచినీళ్లు, మెడికల్ కిట్, గ్లూకోస్ పౌడర్, మజ్జిగ ప్యాకెట్స్ కార్మికులందరికీ ప్రభుత్వం తరుపున అందించాలని, పని గంటలు ఉదయం ఏడు గంటల నుండి 10 గంటల వరకే ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎండలు ఎక్కువగా ఉండటంతో కార్మికులు వడదెబ్బలకు గురై ఇబ్బంది పడుతున్నారన్నారు. వినతిపత్రం సమర్పించిన వారిలో జిల్లా కమిటీ సభ్యులు జిట్టవేణి పెద్ద మల్లయ్య, మల్యాల పవన్, గజ్జల శ్రీహరి, గజ్జల రాజ లింగయ్య తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News