Friday, November 22, 2024
HomeతెలంగాణKarimnagar: విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరపాల్సిందే

Karimnagar: విద్యార్థి మృతిపై సమగ్ర విచారణ జరపాల్సిందే

విద్యార్థి, యువజన సంఘాల డిమాండ్

సోమవారం రాత్రి చింతకుంట గురుకుల కళాశాలలో ఇంటర్నెట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అక్షిత అనే అమ్మాయి మృతిపై సమగ్ర విచారణ జరపాలని ఆ కుటుంబానికి న్యాయం చేసి వారి ఇంట్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేస్తూ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేశారు.

- Advertisement -

విద్యార్థి యువజన నాయకులు మాట్లాడుతూ ప్రిన్సిపాల్ నిర్లక్ష్యం వల్లనే విద్యార్థి మృతి చెందినట్టు, మృతి పట్ల అధికారులు ఎలాంటి చర్యలు లేకుండా సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. గురుకుల పాఠశాలను ఇష్టానుసారంగా ప్రిన్సిపాల్ వివరించడం వలన విద్యార్థి మృతి చెందినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల చదువులపై పర్యవేక్షణ లేకుండా ప్రిన్సిపాల్ ఇస్తారని వివరించడం వలన అమ్మాయి మృతి చెందిందని వారు మండిపడ్డారు.

అమ్మాయి మృతి చెందినప్పటికీ తల్లిదండ్రులకు సరైన సమయంలో సమాచారం ఎందుకు ఇవ్వలేదని దీనిపై అనేక అనుమానాలు ఉన్నాయని అన్నారు. అలాగే అమ్మాయి చనిపోయినప్పటికీ ఉన్నతాధికారులు ఎవరు కూడా పట్టించుకోకపోవడం సిగ్గుచేటు అన్నారు. ఒక పేద విద్యార్థులకు చనిపోతే అధికారులు నిర్లక్ష్యంగా వివరించడం కాకుండా పొంతనలేని సమాధానం చెప్పారని మండిపడ్డారు. తక్షణమే జిల్లా కలెక్టర్ స్పందించి ఆ కుటుంబానికి 50 లక్షలు ఎక్స్ గ్రేషియా వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే మృతిపై విచార జరిపి నిర్లక్ష్యం వహించిన వారందరినీ ఉద్యోగం నుండి తొలగించాలని, జిల్లా కలెక్టర్ స్పందించి తక్షణమే విచారణ జరిపి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. లేనిపక్షంలో దశలవారీగా విద్యార్థి యువజన సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ రమేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ యు ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు సంద గణేష్ పి డి ఎస్ యు ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అంగడి కుమార్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బోనగిరి మహేందర్ బ్రాహ్మణపల్లి యుగంధర్ ఏఐఎస్ఎఫ్ నాయకులు కసిరెడ్డి సందీప్ రెడ్డి నాయకులు చంచల మురళి నగర కార్యదర్శి మామిడిపల్లి హేమంత్ విద్యార్థి బంధువులు తల్లిదండ్రులు వివిధ విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News