పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి చేపడుతున్న హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమాన్ని పురస్కరించుకొని కరీంనగర్ అంబేద్కర్ స్టేడియంలో కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభలో మంత్రి గంగుల కమలాకర్ అవినీతి, అక్రమాలపై చార్జిషీట్ విడుదల చేశారు. మంత్రి గంగుల కమలాకర్ నియోజకవర్గంలో ప్రభుత్వ భూముల కబ్జాకు పాల్పడుతున్నారని, హాజీపూర్ గ్రామంలో 14 ఎకరాల వక్ఫ్ బోర్డ్ భూమిని ఆక్రమించుకుని బినామీగా పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని, 750 కోట్ల పనులు ఎగవేసి హవాలా నెట్వర్క్ నడిపించాడని దీనిపై ఈడీ, సిబిఐ సంస్థల దాడులు కూడా జరిగాయని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో 30% కమీషన్ ను మంత్రి గంగుల డిమాండ్ చేస్తున్నాడని, కరీంనగర్ లో ఐటీ టవర్ నిర్మాణం పేరుతో 35 కోట్ల ప్రజాధనం వృధా చేశాడని, బోగస్ సిబిఐ అధికారులను సృష్టించి అనేక చట్ట విరుద్ధమైన చర్యలకు పాల్పదుతున్నాడని పలు ఆరోపణలు చేశారు జిల్లా కాంగ్రెస్ నేతలు.
అనేక అవినీతి అక్రమాలకు పాల్పడిన కన్నింగ్ కమలాకర్ కు తన పదవి కోల్పోయే రోజులు దగ్గర పడ్డాయని, కమలాకర్ వలన నష్టపోయిన వారు ఎవరైనా వారందరికీ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చారు.