తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కూల్ రూఫ్ విధానాన్ని కరీంనగర్ నగర వ్యాప్తంగా అమలు చేసేందుకు నగరపాలక సంస్థ ద్వారా చర్యలు తీసుకుంటామని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ 33వ డివిజన్ భగత్ నగర్ లోని పోలీస్ క్వాటర్స్ ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం తీసుకొచ్చిన కూల్ రూఫ్ విధానాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ కమీషనర్ సేవా ఇస్లావత్ తో కలిసి మేయర్ ప్రారంభించారు. ఆధునీకరణ పనులు కూల్ రూప్ పెయింటింగ్ పై అధికారులు, కాంట్రాక్టర్లకు సలహాలు, సూచనలు చేస్తూ పలు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కూల్ రూఫ్ విధానాన్ని రాబోయే రోజుల్లో నగర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలకు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలోని 50 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం చేపట్టిన మన ఊరు.. మన బడి.. కార్యక్రమంలో భాగంగా 25 ప్రభుత్వ పాఠశాలలకు అమలు చేయగా, నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ ద్వారా మిగిలిన 25 ప్రభుత్వ పాఠశాలలకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో దాదాపు 7 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలలల్లో వివిధ రకాల ఆధునీకరణ పనులతో పాటు కూల్ రూఫ్ పనులు కూడా చేపట్టడం జరుగుతుందన్నారు. కూల్ రూఫ్ పనులను 33వ డివిజన్ భగత్ నగర్ పోలీస్ లైన్స్ ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించామని తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కూల్ రూఫ్ విధానాన్ని కరీంనగర్ నగర వ్యాప్తంగా అమలు చేసేందుకు నగరపాలక సంస్థ ద్వారా చర్యలు తీసుకుంటామని నగర మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ 33వ డివిజన్ భగత్ నగర్ లోని పోలీస్ క్వాటర్స్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం రోజు ప్రభుత్వం తీసుకొచ్చిన కూల్ రూఫ్ విధానాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ కమీషనర్ సేవా ఇస్లావత్ తో కలిసి మేయర్ ప్రారంభించారు. ఆధునీకరణ పనులు కూల్ రూప్ పెయింటింగ్ పై అధికారులు, కాంట్రాక్టర్లకు సలహాలు, సూచనలు చేస్తూ పలు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన కూల్ రూఫ్ విధానాన్ని రాబోయే రోజుల్లో నగర వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ భవనాలకు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలోని 50 ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం చేపట్టిన మన ఊరు.. మన బడి.. కార్యక్రమంలో భాగంగా 25 ప్రభుత్వ పాఠశాలలకు అమలు చేయగా, నగరపాలక సంస్థ స్మార్ట్ సిటీ ద్వారా మిగిలిన 25 ప్రభుత్వ పాఠశాలలకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో దాదాపు 7 కోట్ల రూపాయల నిధులు కేటాయించి ప్రభుత్వ పాఠశాలలల్లో వివిధ రకాల ఆధునీకరణ పనులతో పాటు కూల్ రూఫ్ పనులు కూడా చేపట్టడం జరుగుతుందన్నారు. కూల్ రూఫ్ పనులను 33వ డివిజన్ భగత్ నగర్ పోలీస్ లైన్స్ ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించామని తెలిపారు.
కూల్ రూఫ్ పెయింటింగ్ వేయడం ద్వారా 10 డిగ్రీల ఉష్ణోగ్రత తగ్గుతుందని తెలిపారు. పాఠశాల భవనాల్లో విద్యార్థులకు వేడిని తగ్గించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. 20 లీటర్ల లిక్విడ్ పేయింట్ ద్వారా దాదాపు 70 స్క్వేర్ ఫీట్ల వరకు వేయొచ్చని తెలిపారు. పేద ప్రజల పిల్లలు చదువుకునే ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలల కంటే ధీటుగా నగరపాలక సంస్థ అభివృద్ధి చేసి పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. 10 కోట్ల రూపాయలతో స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ క్లాస్ రూంలు ఏర్పాటు చేయడంతో పాటు మరో 20 కోట్ల రూపాయల నిధులతో పాఠశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తున్నట్లు తెలిపారు.
ఎక్కడెక్కడైతే పాఠశాలల్లో వసతులు, సౌకర్యాల కొరత ఉందో అలాంటి పాఠశాలలన్నింటినీ ఆధునీకరణ పనుల ద్వారా అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ప్రైవేటు భవన యజమానుదారులు కూడా తమ భవనాలకు కూల్ రూఫ్ పేయింట్ ను వేసుకోవాలని కోరారు. నగరంలోని ప్రభుత్వ కార్యాలయ భవనాలకు కూడా ఈ విధానాన్ని అమలు చేయడం జరుగుతుందన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగం ద్వారా ఈ విధానాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో నగరపాలక సంస్థ అదికారులు పాల్గొన్నారు.