Tuesday, September 17, 2024
HomeతెలంగాణKarimnagar: సేవా పతకాల విజేతలకు సీపీ అభినందన

Karimnagar: సేవా పతకాల విజేతలకు సీపీ అభినందన

ఇటీవల హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన వివిధ రకాల అవార్డులు, పతకాల ప్రదానోత్సవం కార్యక్రమంలో పతకాలను పొందిన కరీంనగర్ కమిషనరేట్ లోని పోలీస్ అధికారులను పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బరాయుడు అభినందించారు. కరీంనగర్ రూరల్ సిఐ విజ్ఞాన్ రావు (ఉత్తమ సేవ) సిఏఆర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ (పరిపాలన) మోడెం సురేష్ (కేంద్ర హోంశాఖ మంత్రి మెడల్) టూ టౌన్ హెడ్ కానిస్టేబుల్ కె శ్రీనివాస్ (ఉత్తమ సేవ) సిఎస్బి కానిస్టేబుల్ నాగమల్లి శ్రీనివాస్ (ఉత్తమ సేవ) ఆర్ఎస్ఐ రాజు (ఆంత్రిక్స్ సురక్ష పతకం) లను పొందిన విషయమే వీరందరిని శుక్రవారం నాడు సిపి అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ మరిన్ని రివార్డులు, అవార్డులు సాధించాలని సమర్థవంతమైన సేవలు ద్వారా పోలీసులకు గుర్తింపు లభిస్తుందని చెప్పారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News