Sunday, October 6, 2024
HomeతెలంగాణKarimnagar CP: మృతి చెందిన ఇద్దరు హోంగార్డుల కుటుంబాలకు ఆర్థిక సాయం

Karimnagar CP: మృతి చెందిన ఇద్దరు హోంగార్డుల కుటుంబాలకు ఆర్థిక సాయం

ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థిక సాయాన్ని అందజేసిన సీపీ

కరీంనగర్ కమిషనరేట్ లోని వివిధ ప్రాంతాల్లో పనిచేస్తూ మృతి చెందిన హోంగార్డుల కుటుంబాలకు కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు ప్రభుత్వం మంజూరు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. 2021 మే 13న కరీంనగర్ పిటిసిలో పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందిన హోంగార్డు కొమురయ్య భార్య కూన నాగమణి, ఈ సంవత్సరం ఏప్రిల్ 30న చొప్పదండి పోలీస్ స్టేషన్ లో పనిచేస్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హోంగార్డ్ పి సదయ్య భార్య జయకు ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్థిక సహాయాన్ని పోలీసు కమిషనర్ అందజేశారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో డిసిపి (శాంతిభద్రతలు) ఎస్ శ్రీనివాస్ అడిషనల్ డిసిపి (సిఏఆర్) ఎం భీమారావు ఎసిపి సి ప్రసాద్, ఆర్ఐ లు మల్లేశం, ఎం సురేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News