Thursday, September 19, 2024
HomeతెలంగాణKarimnagar: సీపీఆర్ ట్రైనింగ్ అందరూ తీసుకోవాల్సిందే

Karimnagar: సీపీఆర్ ట్రైనింగ్ అందరూ తీసుకోవాల్సిందే

కరీంనగర్ జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగులు కార్డియో పల్మనరీ రెసిటేషన్( సి పి ఆర్ )శిక్షణ తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన కార్డియో పల్మనరీ రెసిటేషన్, ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డిసిబ్రీ లెటర్( ఏ ఈ డి) శిక్షణ తరగతులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని శాఖల ఉద్యోగులు తప్పనిసరిగా సిపిఆర్ శిక్షణ పొందాలని సూచించారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి లలితా దేవి మాట్లాడుతూ మే2 నుండి ఈ శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని ఈ శిక్షణకు మున్సిపల్ సిబ్బంది65 మంది హాజరై శిక్షణ తీసుకున్నారని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, శిక్షకులు డాక్టర్ నాగ శేఖర్, సిహెచ్ రంగారెడ్డి ఎన్సిడి పిఓ డాక్టర్ సుజాత తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News