Wednesday, October 30, 2024
HomeతెలంగాణKarimnagar: రామడుగు ఎస్ఐని సస్పెండ్ చేయండని డిజిపికి ఫిర్యాదు

Karimnagar: రామడుగు ఎస్ఐని సస్పెండ్ చేయండని డిజిపికి ఫిర్యాదు

ఇదేనా ఫ్రెండ్లీ పోలీసింగ్?

ఎరుకల యువకుడికి జై భీమ్ సినిమా లాగా లాకప్ లో చిత్ర హింసలకు గురిచేసిన రామడుగు ఎస్సై సురేందర్ ను సస్పెండ్ చేయాలని రాష్ట్ర డిజిపి కి ఫిర్యాదు చేసినట్లు దళిత బహుజన ఫ్రంట్ ( డిబీఎఫ్ ) జాతీయ కార్యదర్శి పి శంకర్ తెలిపారు.

- Advertisement -

మండల పరిధిలోని వెలిచాల గ్రామంలో పోలీస్ చిత్రహింసలకు గురైన కుతాడి కనకయ్యను వారి కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. పోలీస్ హింసను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఎస్సై తన అధికారాదుర్వినియోగానికి పాల్పడ్డాడని ఆరోపించారు. కనకయ్యపై ఏదైనా ఫిర్యాదు వస్తే చట్ట ప్రకారము విచారించాల్సిన ఎస్ఐ మటన్ వ్యాపారి అడుగులకు మడుగులు ఒత్తి ఆయన ముందే కనకయ్యను నాలుగు ధపాలుగా జూన్ 11 నుండి 26 వరకు రామడుగు పోలీస్ స్టేషన్లో కరీంనగర్ టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో తీవ్రంగా కరెంట్ షాక్ పెట్టి చిత్ర హింసలకు గురిచేసరని అన్నారు. ప్రాణాపాయ స్థితికి చేరుకున్న కనకయ్యను వదలకుండా వేధిస్తూనే ఉన్నాడన్నాడు. సృహ కోల్పోయిన కనకయ్యను ఆసుపత్రికి తరలించకుండా అడుగడుగునా అడ్డుకున్నాడని అన్నారు. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డిజిపికి ఫిర్యాదు చేశామని వెల్లడించారు. ఎస్ఐ తో పాటు మటన్ వ్యాపారిపై ఎస్సీ ఎస్టీ అత్యాచారాల నిరోధక చట్టం ప్రకారం కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కనకయ్య కుటుంబానికి ప్రభుత్వం భూమిని ఇందిరమ్మ ఇల్లును, ఉద్యోగం మంజూరు చేసి పునరావాసం కల్పించాలని కోరారు. తెలంగాణ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసు ముసుగులో ఎస్సీ ఎస్టీలను లాకప్ చిత్రహింసలకు పాల్పడడం తగదన్నారు. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని తెలిపారు. ఇకనైనా రామడుగు ఎస్సై బాధితుడిపై రాజీ కోసం ఒత్తిడి చేయడానికి మానుకోవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డి బి ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పులి కల్పన, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్ ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గజ్జల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News