Friday, November 22, 2024
HomeతెలంగాణKarimnagar: నాటు వైద్యులను నమ్మి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు

Karimnagar: నాటు వైద్యులను నమ్మి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు

పైల్స్, ఫిషర్, పిస్టులా లాంటి జబ్బులతో బాధపడుతున్న రోగులు నాటు వైద్యులని నమ్మి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అని ప్రముఖ లాప్రోస్కోపిక్, లేజర్‌ చికిత్స నిపుణులు డాక్టర్‌ చిట్టుమల్ల ప్రదీప్‌ కుమార్‌ అన్నారు. కరీంనగర్‌లోని మైత్రి కన్వెన్షన్‌లో గత రెండు రోజులుగా జరుగుతున్న సౌత్‌ ఇండియా రీజనల్‌ కొలొరెక్టల్‌ కాన్ఫరెన్స్‌ ప్రోక్ట్రోదాస్‌ 2024 సదస్సులో ఆయన మాట్లాడుతూ పైల్స్, ఫిషర్, ఫిస్టులా వ్యాధులకు అత్యధునిక లేజర్, స్టాప్లర్‌ లాంటి ఇవ్వాసివ్‌ పద్దతులు ద్వారా నొప్పి లేకుండా ఆపరేషన్‌ చేసి బాధితుడిని ఒకరోజులోనే డిశ్చార్జ్‌ చేయవచ్చాన్నారు. ఈ విధానం రోగికి పూర్తి స్ధాయిలో సురక్షితమైనదన్నారు.

- Advertisement -

ఈ సదస్సులో దేశ నలుమూలల నుండి వచ్చిన ప్రముఖ కోలోరెక్టల్‌ వైద్య నిష్ణాతులు వివిధ అంశాల గురించి వివరించారు. లైఫ్‌లైన్‌ హాస్పిటల్‌ ఆపరేషన్‌ థియేటర్‌ నుండి వివిధ సర్జరీలను ప్రత్యేకంగా ప్రదర్శించి ఈ సదస్సులో పాల్గొన్న వైద్యులకు వివిధ శస్త్ర చికిత్స పద్దతులపై అవగాహన కల్పించారు.

ఈ సదస్సులో వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన దాదాపు 100 మంది సీనియర్‌ కొలొరెక్టల్‌ నిపుణులు, 400 మంది సర్జన్స్‌తోపాటు కార్యక్రమ నిర్వహణ చైర్మెన్‌ డా. రవీందర్‌ రావు, కార్యదర్శి డా. ప్రదీప్‌ కుమార్, కోశాధికారి డా. అరుణ్‌ కటారి, ఐఎస్‌సిపి కార్యదర్శి డా. అడుకర్, డాక్టర్లు శాంతి వర్ధని. గంగా ఇంకర్, శ్రీనివాస్, ప్రశాంత్, చల్మెడ వైద్య కళాశాల డైరెక్టర్‌ వి. సూర్యనారాయణ రెడ్డి, టీజీఎంసి సభ్యులు డా. రాజ్‌ కుమార్, డా. నరేష్‌ తదితర వైద్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News