కరీంనగర్ లో విద్యుత్తు ఉద్యోగుల బదిలీలలో భాగంగా భారీగా అవకతవకలు జరిగాయని విద్యుత్తు సంస్థ ఉద్యోగులు బాహటంగానే చర్చించుకుంటున్నారు. డబ్బులు పలుకుబడి ఉంటే ఇష్టం ఉన్నచోట పోస్టింగ్ తీసుకోవచ్చని సంస్థ ఉద్యోగులు అనుకుంటున్నారు.
వివరాల్లోకి వెళితే విద్యుత్ సంస్థ కరీంనగర్, కరీంనగర్ రూరల్ ను కరీంనగర్ టౌన్ కు అనుసంధానం చేయడం వలన టౌన్ లో పనిచేసిన విద్యుత్ సంస్థ ఉద్యోగులను మళ్లీ కరీంనగర్ టౌన్ లో పోస్టింగ్ ఇవ్వరాదని సంస్థలో ఉన్న నిబంధనలకు విరుద్ధంగా డబ్బులు ఉంటే ఎక్కడ అనుకూలంగా ఉండే అక్కడ పోస్టింగ్ తీసుకోవచ్చు అనే దానికి ఇది నిదర్శనం. విద్యుత్ శాఖ తయారు చేసిన రోస్టర్ లోని 15వ నెంబర్ లోని ఓ వ్యక్తి కరీంనగర్ టౌన్ 8వ వాటర్ వర్క్స్ సబ్ స్టేషన్ లో ఉన్న లైన్మెన్ ఆపరేటర్ నాలుగు సంవత్సరాలుగా పనిచేస్తూ సాధారణ బదిలీలలో భాగంగా తిరిగి రేకుర్తి లైన్మెన్ గా బాధ్యతలు తీసుకున్నాడు. యూనియన్ కు సంబంధించిన ప్రొడక్షన్ లెటర్ లేకుండానే రేకుర్తిలో లైన్మెన్ బాధ్యతలు అప్పగించారు. ఈ బదిలీల్లో జరిగిన అవకతవకలపై విద్యుత్ సంస్థ సీఎండీ వరంగల్ వారు పూర్తిస్థాయిలో విచారణ జరిపి అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు ఏ విధంగా తీసుకుంటారో అని విద్యుత్ సంస్థ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు.
కరీంనగర్ టౌన్ డి ఈ. రాజం వివరణ..
విద్యుత్ ఉద్యోగుల బదిలీలలో అవకతవకలు జరిగాయని వస్తున్న వార్తలు నిజం కాదని, విద్యుత్ సంస్థ గైడ్లైన్స్ ప్రకారమే బదిలీలు చేశామని కరీంనగర్ టౌన్ డి. ఈ.రాజం అన్నారు.