Friday, September 20, 2024
HomeతెలంగాణKarimnagar: మద్యం మత్తులో విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్

Karimnagar: మద్యం మత్తులో విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్

విద్యుత్ అధికారుల పర్యవేక్షణ కరువు

విధుల పట్ల అనునిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన విద్యుత్ సబ్ స్టేషన్ ఆపరేటర్ తన విధులను విస్మరించి మద్యం మత్తులో ఉండడం చూస్తుంటే విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. వివరాల్లోకి వెళితే… రామడుగు మండలం గుండి సబ్ స్టేషన్ లో ఆపరేటర్ గా విధులు నిర్వహిస్తున్న వినయ్ మద్యం మత్తులో విధులకు హాజరవడం విస్మయాన్ని కలిగిస్తుంది. అటువైపుగా వెళ్లిన ఓ వ్యక్తి ఇట్టి విషయాన్ని గమనించి సదరు విషయాన్ని విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న విద్యుత్ అధికారులు వినయ్ కి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించగా 280 పాయింట్లు రావడంతో ఒక్కసారిగా అవాక్కయ్యారు.

- Advertisement -

ఎప్పుడు ఏ సమయంలో విద్యుత్ లో హెచ్చుతగ్గులు వస్తాయో కనిపెట్టుకుంటూ ఉండే ఉద్యోగి ఇలా మద్యం మత్తులో ఉండడం పట్ల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో గంగాధర మండలంలో ఓ సబ్ స్టేషన్ ఆపరేటర్ మద్యం మత్తులో ఎల్ సి తీసుకున్న సమయంలో ఒక లైనుకు బదులు మరో లైన్ విద్యుత్ సరఫరా చేయడంతో తిర్మలపూర్ గ్రామానికి చెందిన మల్లేశం విద్యుత్ సరఫరా కావడంతో ఒక నిండు ప్రాణం బలికొన్న సంఘటన చోటు చేసుకున్న విషయం విధితమే. అనునిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన విధులకు మద్యం సేవించి హాజరు కావడం పట్ల సర్వత్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ ఏ మేరకు చర్యలు చేపడుతుందోనని మండల ప్రజలు చర్చించుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ అనునిత్యం అప్రమత్తంగా ఉండాల్సిన విద్యుత్ శాఖ ఆపరేటర్లు తమ విధుల పట్ల అలసత్వం లేకుండా ఉండేందుకు ఉన్నత స్థాయి అధికారులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మండల ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News