Friday, November 22, 2024
HomeతెలంగాణKarimnagar: ఎన్నికల వాహనాలకు జీపీఎస్ అనుసంధానం

Karimnagar: ఎన్నికల వాహనాలకు జీపీఎస్ అనుసంధానం

కలెక్టర్ పమేలా సత్పతి

ఈవీఎంల పట్ల నిర్లక్ష్యం వహించరాదని, ఎన్నికల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను భద్రంగా తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. కరీంనగర్లోని ఎస్ఆర్ఆర్ డిగ్రీ కళాశాలలో కరీంనగర్, చొప్పదండి నియోజకవర్గాలకు సంబంధించి, మానకొండూర్ కు సంబంధించి కరీంనగర్లోని పాలిటెక్నిక్ కళాశాలలో ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

- Advertisement -

హుజురాబాద్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆ నియోజకవర్గానికి సంబంధించిన ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ ను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయా కేంద్రాల్లో చేపట్టిన ఏర్పాట్లపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కూలర్లు, విద్యుత్తు సక్రమంగా ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మే 13న పోలింగ్ పకడ్బందీగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశామని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు కేటాయించిన బ్యాలెట్ యూనిట్స్, కంట్రోల్ యూనిట్స్, వీవీ ప్యాట్స్ తీసుకొని అప్రమత్తంగా వెళ్లాలని సూచించారు.

మెటీరియల్ అంతా ఉన్నదా లేదా అని సరిచూసుకోవాలని తెలిపారు. అన్ని సక్రమంగా చూసుకోవాలని, ఏది మర్చిపోవద్దని సూచించారు. పోలింగ్ అధికారులు, సిబ్బంది ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనల ప్రకారం పనిచేయాలని పేర్కొన్నారు. పోలింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు బాధ్యతయుతంగా పనిచేయాలని చెప్పారు. ఎలాంటి తప్పుదాలకు ఆస్కారం ఇవ్వవద్దని, సమస్యలు ఏమైనా ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈవీఎంలు తరలించే వాహనాలకు జిపిఎస్ అనుసంధానం చేశామని, పటిష్ట పోలీస్ బందోబస్తు మధ్య ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు తరలిస్తున్నామని చెప్పారు.

పోలింగ్ పూర్తయిన తర్వాత అదేవిధంగా జాగ్రత్తగా కరీంనగర్ లోని స్ట్రాంగ్ రూములకు తరలించాలని పేర్కొన్నారు. ఆయా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లను క్షుణ్ణంగా పర్యవేక్షించారు. ఈవీఎంలను పరిశీలించి సిబ్బందితోనూ మాట్లాడారు. పోలింగ్ కు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్ లోని పాలిటెక్నిక్ కళాశాలలో మానకొండూర్ నియోజకవర్గ ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ కేంద్రాన్ని కలెక్టర్ తో పాటు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ సాధారణ పరిశీలకులు, ఐఏఎస్ అధికారి అమిత్ కటారియా పరిశీలించారు.


ఆయా కార్యక్రమాల్లో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ సాధారణ ఎన్నికల పరిశీలకులు అమిత్ కటారియా, అదనపు కలెక్టర్లు ప్రఫుల్ దేశాయ్, లక్ష్మి కిరణ్, ఆర్డీవోలు కే మహేశ్వర్, రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News