Saturday, November 23, 2024
HomeతెలంగాణKarimnagar: ఉపాధి హామీ పథకాన్ని తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే

Karimnagar: ఉపాధి హామీ పథకాన్ని తెచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే

మజ్జిగ, నీళ్లు పంపిణీ చేసిన వెలిచల రేఖ

పల్లెల్లో ప్రజలందరికి ఉపాధి కల్పించి, ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు 2006లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించిందని కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు సతీమణి రేఖ పేర్కొన్నారు. రామడుగు మండలంలోని తమ స్వగ్రామమైన గుండీ గ్రామంలో రేఖ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా చెరువు కట్ట వద్ద ఉపాధి పనులు కూలీలతో ముచ్చటించారు. గత కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదని, ప్రజలను నిలదీస్తారనే భయంతో ఉపాధి నిధులను కూడా ఎంపీ లాడ్స్ నిధులు అంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని విమర్శించారు.

- Advertisement -

పల్లెల్లో పేదల కడుపు నింపటంలో ఉపాధి హామీ పథకం ప్రధానమైందని, వంద రోజుల పని దినాలతో కోట్లాది మంది పేదలు సంతోషంగా జీవిస్తున్నారని నమ్మకం వెలిబుచ్చారు. ఇలాంటి మహోత్తమైన పథకాల రూపకల్పన చేసిన కాంగ్రెస్ పార్టీని కేంద్రంలో గెలిపించుకొని రాహుల్ గాంధీని ప్రధానిగా చూసుకుందామని కోరారు. ఇక తన భర్త వెలిచాల రాజేందర్ రావు కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, జగపతి తనయుడిగా మీకు సుపరిచితుడైన రాజేందర్ రావును హస్తం గుర్తుపై ఓటు వేసి వారి మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఈ సందర్భంగా ఎండలో పనులు నిర్వహిస్తున్న కూలీలకు పండ్లు, మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. రేఖ వెంట ఆమె సోదరి అన్నపూర్ణమ్మ, మాజీ ఎంపిటిసి గుండి ప్రవీణ్ , గోపాలరావు పేట మాజీ సర్పంచ్, జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కర్ర సత్య ప్రసన్న వెంకటరామిరెడ్డి, మాజీ ఎంపీపీ దుర్గం రాజేశం, రామడుగు మండల మహిళా అధ్యక్షురాలు గుడ్ల భవాని, గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు కత్తి లచ్చయ్య, మడ్డి ఆంజనేయులు,మేకల కొమురయ్య, బండారి చంటయ్య,బండారి శ్రీనివాస్, గోపాలరావుపేట్ మాజీ ఎంపీటీసీ ఏపూరి తిరుపతి గౌడ్, వివిధ కుల సంఘాల నాయకులు వివిధ గ్రామాల ప్రజలు మహిళలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News