Sunday, October 6, 2024
HomeతెలంగాణKarimnagar: ఉద్యమ గాన కోకిల పురస్కారానికి ఎంపిక

Karimnagar: ఉద్యమ గాన కోకిల పురస్కారానికి ఎంపిక

జానపదమే ప్రాణపదంగా ఎదిగిన జలపతికి పల్లె పదాలతో పాటలు కట్టడం, పాడడం, నృత్యం చేయడం వెన్నతో పెట్టిన విద్య. అది తెలంగాణ ఉద్యమమైనా, ప్రభుత్వ పథకాల ప్రచారమైనా, సామాజిక చైతన్య కార్యక్రమమైనా ఆయన పాట ఎందరికో స్ఫూర్తినిచ్చింది. అలాంటి పల్లె పాటల జలపతి ఉద్యమ గాన కోకిల పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నెల 12న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించే కార్యక్రమంలో ఆయన ఈ అవార్డును అందుకోనున్నారు.
గుమ్మడి జలపతి నేపథ్యం
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన గుమ్మడి జలపతి ఒగ్గు కథలు, యక్షగానం, చిరతల రామాయణం ప్రభావం ఎక్కువ. అలా చిన్నతనం నుంచే పాఠశాలలో ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించాడు. జలపతి ఆటపాటకు మైమరచిన ఉపాధ్యాయులు గుగులోతు వెంకటేశ్ నాయక్, పాలవేణి శ్రీనివాస్ మండల, జిల్లా స్థాయిలో ప్రదర్శనలిచ్చేలా ప్రోత్సహించారు.

- Advertisement -

జలపతి పదిహేళ్ల వయస్సులోనే మొదటిసారి కళాభారతిలో “పొద్దు తిరుగుడు పువ్వు పొద్దును ముద్దాడే..’ అనే గద్దర్ పాటను పాడి, జిల్లా స్థాయిలో ప్రధమ బహుమతి అందుకున్నాడు. ఆ పాట పాడుతుండగా విన్న జానపద కళాకారులు వెంకటేశ్ నాయక్, శ్రీనివాసులు జలపతికి వారి బృందంలో స్థానం కల్పించి, జానపద గేయాలాపనలో మరిన్ని మెళకువలు నేర్సించారు. ఒక కళాకారుడిగా తీర్చిదిద్ది. రాష్ట్ర, జాతీయస్థాయిలో ఎన్నో ప్రదర్శనలు ఇప్పించారు.
గుమ్మడి జలపతి సామాజిక స్పృహ
ఎయిడ్స్ నివారణ, బాల కార్మికుల సంరక్షణ, నిరక్షరాస్యత నిర్మూలన తదితర అంశాలపై ప్రజల్లో చైతన్యం నింపాడు. వివిధ ప్రభుత్వ పథకాలపై పాడుతూ ప్రజలను చైతన్య పరిచాడు. సుమారు 30 వీడియో ఆల్బమ్లలో, ఆల్ ఇండియా రేడియోలో పలు జానపద గేయాలు ఆలపించాడు. హెచ్ఎం టీవీలో ‘మార్మోగిన పాట’ కార్యక్రమంలో పాల్గొని రసమయి బాలకిషన్ చేతుల మీదుగా ప్రసంశలు అందుకున్నాడు. సుమారు 85కు పైగా జానపద, భక్తి గీతాలను రచించి, సీడీల రూపంలో తీసుకొచ్చారు.


ఉద్యమంలో భాగంగా పది జిల్లాల్లో సుమారు 150కి పైగా ప్రదర్శనలతో ప్రజలను చైతన్య పర్చాడు. కేసీఆర్ పిలుపు మేరకు చొప్పదండి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గ్రామ గ్రామాన ధూంధాం నిర్వహించి, ప్రజల్లో ఉద్యమ కాంక్షను రేపాడు. కాగా తనకు చిన్ననాటి నుంచి గోరటి వెంకన్న, ప్రజా గాయకుడు గద్దర్, మిట్టపెల్లి సురేందర్ స్ఫూర్తి ప్రదాతలని జలపతి “తెలుగు ప్రభ” ప్రతినిధికి తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News