కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు గెలుపు కోసం ఏఐఎస్ఎఫ్ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి మచ్చ రమేష్ వృద్ధుల కాళ్ళు మొక్కుతూ ఓట్లు అభ్యర్థించడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కనిపించిన ప్రతి వృద్ధులను కాళ్ళు మొక్కుతూ, మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు వేసి గెలిపించాలని కోరారు.