Tuesday, September 17, 2024
HomeతెలంగాణKarimnagar: కరీంనగర్ డైరీ మూసేయండి-స్థానికుల డిమాండ్

Karimnagar: కరీంనగర్ డైరీ మూసేయండి-స్థానికుల డిమాండ్

నీటి, వాయు, జల కాలుష్యానికి కారణమవుతున్న డైరీ

గత దశాబ్ద కాలం నుండి కరీంనగర్ డైరీ నుంచి వెలువడుతున్న వ్యర్థాలు దాని పరిసర ప్రాంతాల్లోని భూమిలో కలువడం వల్ల భూగర్భ జలాలు తీవ్రంగా కలుషితం కావడం తద్వారా ఆరోగ్య సమస్యలు, చర్మ వ్యాధులు వస్తున్నాయనీ ఇంటి లోని వంట సామాన్లు, గేట్లు సైతం “తీవ్రంగా దెబ్బ తింటున్నాయనీ 16వ డివిజన్ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ అన్నారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కాలుష్యం కారణంగా ఆ ప్రాంతంలోని బోరు నీళ్ల యొక్క టి.డి.ఎస్ 2000గా ప్రమాద స్థాయిలో ఉందన్నారు. బోరు నీళ్లు తాగునీటి అవసరానికి వాడుకోవడానికి ఏమాత్రం అనువుగా లేవని డైరీ నుంచి వెలువడే వ్యర్థాల నుండి విపరీతమైన దుర్వాసన వెలువడుతుందన్నారు. ఆ దుర్వాసన పద్మానగర్ మొదలుకొని దాదాపు రెండవ టౌన్ పోలీసు స్టేషన్ వరకు వ్యాపించి, జనాలకు శ్వాస తీసుకోవడం కూడా కష్టమవుతున్నదన్నారు. పిల్లలు, వృద్ధులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. డైరీ చిమ్నీ నుండి దట్టమైన పొగలు వస్తున్నాయనీ, ఆ పొగ నుండి వెలువడిన బూడిద గాలిలో కలిసి అన్ని దిశల్లో ప్రయాణించి ఇళ్ళ స్లాబుల పైన పేరుకుపోతున్నాయన్నారు. వాటి ద్వారా శ్వాసకోశ ఆరోగ్య సమస్యలు అస్తమా ఊపిరితిత్తుల సమస్యలు చిన్నపిల్లలలో చాలా అధికంగా వస్తున్నాయన్నారు.


మా సమస్యలను దృష్టిలో ఉంచుకుని, మా సమస్యలపై తక్షణం స్పందించి డైరీ నుంచి వెలువడే వ్యర్ధాలు భూమిలో, నీటిలో గాలిలో కలవకుండా, అలాగే డైరీ నుంచి వస్తున్న దుర్వాసనను సైతం నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని 16వ డివిజన్ కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్ కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News