Saturday, November 23, 2024
HomeతెలంగాణKarimnagar: ఒయాసిస్ లో అధునాతన సంతానోత్పత్తి చికిత్సలు

Karimnagar: ఒయాసిస్ లో అధునాతన సంతానోత్పత్తి చికిత్సలు

ఒయాసిస్ ఫెర్టిలిటీ డాక్టర్ జిగ్నా తమగోం

ఒయాసిస్ లో అధునాతన సంతానోత్పత్తి చికిత్సలు కలవని ఒయాసిస్ ఫెర్టిలిటీ కన్సల్టెంట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ జిగ్నా తమగోండ్ తెలిపారు. సున్నా స్పిర్మ్ కౌంట్ ఉన్న పురుషులు పితృత్వాన్ని సాధించడంలో మైక్రోటీస్ (మైక్రోసర్జికల్ టెస్టిక్యులర్ స్పెర్మ్ ఎక్స్ట్రాక్షన్) వంటి అధునాతన పద్ధతులను అందిస్తున్నామని పేర్కొన్నారు. కరీంనగర్ లో గల ఒయాసిస్ ఫెర్టిలిటీలో ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చిన తల్లులను సత్కరించారు. ఈ కార్యక్రమానికి డీఎంహెచ్వో డాక్టర్ లలితా దేవి, గంగుల కమలాకర్ సతీమణి హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ జిగ్నా తమగోండ్ మాట్లాడుతూ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న కాబోయే తల్లులందరికీ అభినందనలు తెలిపారు.

- Advertisement -

ఫెర్టిలిటీ ప్రిజర్వేషన్ అనేది ఒక అధునాతన సాంకేతికత అన్నారు. ఇది క్యాన్సర్ బాధపడుతున్న మహిళలకు ఎంతో ఉపయోగకరమన్నారు. సంతానోత్పత్తిని కాపాడుకోవడానికి, తర్వాత గర్భం దాల్చడానికి సహాయపడుతుందని పేర్కొన్నారు. పీజీటీ (ప్రే-ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్). ఈఆర్ (ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అర్రే) ద్వారా ఐవీఎఫ్ సక్సెస్ రేటును మెరుగుపరుస్తున్నామని తెలిపారు. గర్భస్రావం ప్రమాదాన్ని తగ్గిస్తున్నామని చెప్పారు. నిశ్చల జీవనశైలి, నిద్రలేమి, ఊబకాయం, ఆలస్యమవుతున్న మాతృత్వం, పీసీవోఎస్ తదితర కారణాల వల్ల వంధ్యత్వం క్రమంగా పెరుగుతోందని తెలిపారు. వంధ్యత్వాన్ని అధిగమించి తల్లిదండ్రులుగా మారవచ్చన్నారు.

ఒయాసిస్ ఫెర్టిలిటీ గురించి.. ఒయాసిస్ ఫెర్టిలిటీ, సద్గురు హెల్త్కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్, సంతానోత్పత్తి చికిత్సలలో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ఉత్తమ పద్ధతులు, ప్రోటోకాల్లను తీసుకురావడం ద్వారా భారతదేశంలో పునరుత్పత్తి సంరక్షణను పునర్నిర్వచించింది. ఇది తల్లిదండ్రులకు స్నేహపూర్వకమైన ‘వన్-స్టాప్’ డే. కేర్ క్లినిక్ను అందిస్తుంది. ఇక్కడ సంప్రదింపులు, పరిశోధనలు చికిత్స అన్నీ ఒకే పైకప్పు క్రింద నిర్వహించబడతాయి. 2009లో ప్రారంభమైనప్పటి నుంచి ఒయాసిస్ అంతర్జాతీయ అనుభవం కలిగిన అనుభవజ్ఞులైన వంధ్యత్వ నిపుణుల బృందం నేతృత్వంలోని దాని అధిక నాణ్యత సేవల ద్వారా దాని అధిక విజయాలతో అద్భుతమైన ఖ్యాతిని పొందింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, జార్ఖండ్, గుజరాత్, మహారాష్ట్ర, చత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాలలో 33 పైగా కేంద్రాలకు విస్తరించింది. మరింత సమాచారానికి 9959154371/ 9985310069 సంప్రదించాలని కోరారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News