Friday, April 4, 2025
HomeతెలంగాణKarimnagar: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

Karimnagar: పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

స్కూల్ డేస్..

పదవ తరగతి వరకు తమతో కలిసి చదువుకున్న చిన్ననాటి మిత్రులతో సరదాగా గడపడంతో పాటు కష్టసుఖాలను పంచుకునేందుకు రామడుగు మండలం గుండి గోపాల్ రావు పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1994-95 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న విద్యార్థిని విద్యార్థులు ఆదివారం కొండగట్టు బృందావన్ రిసార్ట్ లో కలుసుకొని ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా జరుపుకున్నారు. బాల్యం నుండి 10వ తరగతి వరకు చదువుకునే రోజులలో చేసిన అల్లర్లను, ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ ఆప్యాయతలను నెమరు వేసుకున్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు పిల్లలుగా మారి ఆటపాటలతో అల్లరి చేశారు.

- Advertisement -

సుదూర ప్రాంతాల్లో వివిధ వృత్తులలో స్థిరపడ్డ వారు ఒకచోట చేరి ఆనందంగా గడపడంతో పాటు వారికి విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు పాదాభివందనం చేసి శాలువాలతో పూలమాలలతో ఘనంగా సన్మానించుకున్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ గ్రంధాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, కర్ర అశోక్ రెడ్డి, అక్షర స్కూల్ మునిందర్, రామడుగు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గోల్లే రామస్వామి, బోగే రవీందర్,ఎం. కిషోర్,కుమార స్వామి, కందుల స్కులాబ్,లక్కీ పౌండేషన్ చైర్మన్ మడ్డి తిరుపతి గౌడ,రమేష్, లంక మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News