ప్రైవేట్ ఉపాధ్యాయ పరిరక్షణ చట్టం కేంద్రం తేవాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండల కేంద్రంలో ట్రస్మా ఆత్మీయ సమ్మేళనం చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయిన్పల్లి వినోద్ కుమార్ హాజరై మాట్లాడుతూ పలు కార్మికులకు కల్పిస్తున్న విధంగా ప్రైవేట్ ఉపాధ్యాయులకు కూడా సాంఘిక సంక్షేమ చట్టం కేంద్రం ప్రవేశపెట్టాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న జనాభాలో 53 శాతం విద్యార్థులకు బోధన కల్పిస్తున్న ప్రైవేట్ ఉపాధ్యాయులకు రక్షణ కల్పించాలని అన్నారు. 2014లో ఎంపీగా ఉన్న సమయంలో పాఠశాలలు నిర్వహిస్తున్న వారికి అనేక సదుపాయాలు కల్పించానని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం రాకముందు ప్రైవేట్ పాఠశాలల యజమానులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారని తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక కెసిఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రైవేట్ పాఠశాలల నిర్వహణలో అనేక రాయితీలు కల్పించారని అన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్ రావు, జిల్లా అధ్యక్షుడు లక్ష్మారెడ్డి ,గంగాధర ఎంపీపీ శ్రీరామ్ మధుకర్ ,మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వేచినేని నవీన్ రావు, మాజీ సింగిల్ విండో చైర్మన్ సాగి మహిపాల్ రావు, మాజీ మార్కెట్ చైర్మన్ తిరుమలరావు, ఏఎంసీ చైర్మన్ గడ్డం చుక్కారెడ్డి, రిటైర్డ్ జాయింట్ కలెక్టర్ బైరం పద్మయ్య ,మాజీ జెడ్పిటిసి ఇప్పనపల్లి సాంబయ్య ,ఎంపీటీసీ వంచ మహేందర్ రెడ్డి, వివిధ పాఠశాలల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు కరస్పాండెంట్లు తదితరులు పాల్గొన్నారు.