Sunday, September 8, 2024
HomeతెలంగాణKarimnagar: రంజాన్ లో హలీం రుచులు

Karimnagar: రంజాన్ లో హలీం రుచులు

రంజాన్‌ అంటే హలీం, హలీం అంటే రంజాన్‌ అనే స్థాయిలో ప్రాచుర్యం పొందిందీ వంటకం. ఒక్క హైదరాబాద్ లోనే కాదు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో హలీం తయారవుతోంది.  అంతేకాదు వివిధ ప్రాంతాల నుంచి ఎగుమతి కూడా అవుతోంది.  కరీంనగర్ లో కూడా ఇలాంటి ఇరానీ హలీం స్టాల్ అందరినీ ఆకట్టుకుంటోంది.  ఇరానీ పద్ధతిలోనే మాహేక్ క్యాటరింగ్ సెంటర్ కింగ్స్ హలీం హోటల్‌లో హలీం తయారు చేస్తున్నట్టు నిర్వాహకులు వివరిస్తున్నారు.

- Advertisement -

ఇరానీ హలీం ప్రత్యేకత ఏమిటంటే ఘాటుగా ఉండదు. ఇందుకు గోధుమలు, మాంసం, నెయ్యి సమానంగా తీసుకోవాలి. ఈ మూడు హలీం తయారీకి కీలకం. మసాల దినుసులు వంటకానికి అనుగుణంగా వాడుకోవాలి.

ప్రస్తుతం నగరంలోని ఎన్నో హోటళ్లలో హలీం తయారు చేస్తున్నా, ఇరానీ హోటళ్లలో మాత్రమే ఇరానీ పద్ధతిలో హలీం తయారు చేస్తున్నారు. “మేము నేటికీ ఇరానీ పద్ధతిలోనే హలీం తయారు చేస్తున్నాం. 20 ఏళ్లుగా మాహేక్ క్యాటరింగ్ సెంటర్ ద్వారా తెలంగాణ వ్యాప్తంగా హలీం, బిర్యానీ, అరేబియన్ వంటలకు కేరాఫ్ అడ్రస్ గా కరీంనగర్ వేదికగా పని చేస్తున్నాము. కరీంనగర్ నగర ప్రజలకు ఆహార అలవాట్లకు అనుగుణంగా తయారు చేయడం మా ప్రత్యేకత. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ.. స్వచ్ఛమైన మసాలా దినుసులు వినియోగిస్తున్నాం” అంటూ.. కింగ్స్ హలీం నిర్వాహకుడు బాబా పటేల్ చెబుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News