Karimnagar School: కరీంనగర్ జిల్లా గంగాధరలోని ఓ పాఠశాలలో చోటుచేసుకున్న దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. పాఠశాల అటెండర్‌గా పనిచేస్తున్న యాకుబ్‌పై బాలికల తల్లిదండ్రులు, స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. పాఠశాల బాలికల ఫొటోలను మార్ఫింగ్ చేసి, ఆ వీడియోలను చూపించి, పిల్లలను లైంగికంగా వేధింపులకు గురిచేస్తున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. బాలికలను బెదిరించి, అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడినట్లుగా వస్తున్న ఆరోపణలు సంచలనం సృష్టించాయి.
ఈ దారుణ ఘటనపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ (BJP) నేతలు సహా స్థానికులు ఆందోళనకు దిగారు.
కేంద్ర మంత్రి, స్థానిక ఎంపీ అయిన బండి సంజయ్ ఈ ఘటనపై తీవ్రంగా స్పందించారు. ఆయన వెంటనే కరీంనగర్ గ్రామీణ ఏసీపీతో ఫోన్‌లో మాట్లాడారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని, కేసును సమగ్రంగా దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించారు. నిందితుడి వద్ద ఉన్న అన్ని వీడియోలను, డిజిటల్ సాక్ష్యాలను వెంటనే స్వాధీనం చేసుకోవాలని స్పష్టం చేశారు.
బండి సంజయ్ ఆదేశాల మేరకు పోలీసులు తక్షణమే స్పందించి, నిందితుడు యాకుబ్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. నిందితుడిపై పోక్సో (POCSO) సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం. ఈ కేసుపై పూర్తిస్థాయి దర్యాప్తు కొనసాగుతోంది. ఈ ఘటనపై విద్యాశాఖ ఉన్నతాధికారులు కూడా దృష్టి సారించి, పాఠశాలల్లో బాలికల భద్రతపై మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఈ సంఘటన మరోసారి నొక్కి చెప్పింది.


