Saturday, November 23, 2024
HomeతెలంగాణKarimnagar: ఎస్సారెస్పీ అధికారుల మొద్దు నిద్ర

Karimnagar: ఎస్సారెస్పీ అధికారుల మొద్దు నిద్ర

కాలువలు మరమ్మత్తు చేసేది ఎప్పుడు.. రైతులకు నీరు అందేదెప్పుడు

ఎస్సారెస్పీ అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదు. సంవత్సరం క్రితం కురిసిన భారీ వర్షాలకు కెనాల్ కొట్టుకుపోయిన ఇప్పటివరకు సదరు కెనాల్ కి మరమ్మతులు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే రైతులకు సాగునీరు అందించడంలో ఎస్సారెస్పీ అధికారులు ఎంత నిర్లక్ష్యంగా ఉంటున్నారో కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. ప్రతిరోజు ఎస్సారెస్పీ కాలువల వెంట తిరుగుతూ మరమ్మత్తులు అవసరం ఉన్నచోట నివేదికలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపించి మరమ్మత్తు పనులు చేపట్టాల్సి ఉండగా ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడంతో ఈ వానాకాలం సీజన్లో రైతులకు కాలువల ద్వారా సాగునీరు అందడం ప్రశ్నార్థకంగా మారుతుంది.

- Advertisement -

వివరాల్లోకి వెళితే… కరీంనగర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న రేకుర్తి గ్రామ శివారులోని ఎస్సారెస్పీ కెనాల్ డి 94 కాల్వ 3.70 విడ్త్ డ్రాప్ కూలిపోయి సంవత్సరమవుతున్న ఎస్సారెస్పీ అధికారులు పట్టించుకోవడం లేదు. నిత్యం కాలువలను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు కాలువ కూలిపోయిన ఏదైనా తట్టుకున్నపై అధికారులకు తెలియజేస్తూ రిజిస్టర్ లలో రాసి పై అధికారులకు నివేదికలు పంపించాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ దానికి విరుద్ధంగా నడుస్తుంది. గత సంవత్సరం భారీ వర్షాలకు ఎస్ ఆర్ ఎస్ పి డి 94 కాల్వ 3.70 విడ్త్ డ్రాప్ కూలిపోయి సంవత్సరం అయిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం చూస్తుంటే ఎస్సారెస్పీ అధికారులు రైతులకు ఏ విధంగా న్యాయం చేస్తారో అర్థం కావడం లేదు.

ఈ ఖరీఫ్ సీజన్ లో రైతులు మళ్లీ వ్యవసాయం పనులను ప్రారంభిస్తున్న కాని ఆ కాలువను మరమ్మత్తు లు మాత్రం చేయడం లేదు. దీంతో ఈ ఖరీఫ్ సీజన్లో రైతులకు సాగునీరు అందడం ప్రశ్నార్ధకంగానే ఉంది. ఇప్పటికైనా ఎస్సారెస్పీ అధికారులు స్పందించి వెంటనే కాల్వకు మరమ్మత్తు పనులు చేపట్టి రైతులకు సాగునీరు అందించడంలో ఇబ్బందులు లేకుండా చూడాలని స్థానిక రైతులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News