విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు చెప్పిన మార్గాలను అనుసరించి ముందుకు సాగాలని కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. ప్రతిమ అన్నారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గ్రామంలోని అక్షర హై స్కూల్ లో గుమ్మడి ప్రశాంత్ న్యాయవాది, హై స్కూల్ యాజమాన్యం ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి. ప్రతిమ హాజరై విద్యార్థులు ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలని తల్లి దండ్రులు ఉపాద్యాయులు చెప్పిన మార్గాలను అనుసరించి ముందుకు సాగాలని చిన్న వయసులోనే లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని నిరంతరం వాటి కోసం కృషి చేయాలని సాంఘిక మాద్యమలకు దూరంగా వుండాలని వాటిని ఉపయోగించడం వల్ల జీవితంలో విలువైన సమయం వృథా అయిపోతుందని అన్నారు.
గృహహింస, వరకట్నం, ఆన్లైన్ నేరాలపైన అవగాహన కలిగి ఉండాలని, ఆడపిల్లలు సామాజిక మాధ్యమాల్లో ఫొటోస్ గానీ వీడియోస్ గానీ పెట్టకూడదని, ఏదైనా సమస్యలు వస్తే పోలీస్ వారిని సంప్రదించాలని తెలిపారు. సమాజంలో ఆడపిల్లలు ఆర్థికంగా ఎదగాలని వరకట్నం ఇవ్వడం తీసుకోవడం నేరమని, వరకట్న నిర్మూలనకు భావితరాలు కృషి చేయాలని, పిల్లలు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, మీ క్రమశిక్షణే మిమ్మలను జీవితం ఉన్నతమైన శిఖరాలకు చేరవేస్తుంది అని సూచించారు.
కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో విజేతలుగా నిలిచిన అన్ని పాఠశాలల విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేశారు. కరీంనగర్ న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి కే.వెంకటేష్ మాట్లాడుతూ న్యాయసేవాధికార సంస్థ గ్రామీణ ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. నూతన చట్టాల గురించి వివరించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మానస ప్రవీణ్ చొప్పదండి సి ఐ జీ. రవీందర్, రామడుగు ఎస్ ఐ నేరెళ్ళ రమేష్ గౌడ్, అక్షర హై స్కూల్ హెడ్మాస్టర్ మినుకుల రాధా కరస్పాండెంట్ మినుకుల మునీందర్, కరీంనగర్ న్యాయవాదులు అల్ఫార్స్, శ్రీ ప్రగతి, జడ్.పి.హెచ్.ఎస్ గుండి, జడ్.పి.హెచ్.ఎస్ గోపాలరావుపేట, విద్యార్థులు ఉపాద్యాయులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు..