Saturday, November 23, 2024
HomeతెలంగాణKarimnagar: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా చేయండి

Karimnagar: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా చేయండి

జూన్ 2 తెలంగాణ ఆవిర్బావ దినోత్సవమును ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆర్. వి. కర్ణన్ అన్నారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో అన్ని శాఖల అధికారులతో జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 2 తెలంగాణ ఆవిర్బావ దినోత్సవం నాడు పతాకావిష్కరణ కార్యక్రమం అనంతరం జిల్లాలోని మిషన్ భగీరథ, వైద్యశాఖ, సంక్షేమశాఖలు, ఇరిగేషన్, టూరిజం, వ్యవసాయం, డిఆర్డిఏ, పంచాయతి రాజ్ ఆర్ అండ్ బి, ఎలక్ట్రిసిటీ, మెప్మా మున్సిపాలిటీ మార్కెటింగ్, డిడబ్ల్యుఓ, క్రీడల అభివృద్ధి శాఖ తో పాటు తదితర శాఖలు 2014 నుండి 2023 వరకు అమలు చేసిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాల సమాహారంతొ కూడిన శకటాలను రూపొందించి ప్రదర్శించాలని అదే విధంగా శాఖల వారిగా స్టాల్స్ ఏర్పాటు చేయాలని తెలిపారు. దశాబ్ది ఉత్సవాలలో బాగంగా నిర్వహించె కార్యక్రమాలలో తెలంగాణ వ్యవసాయం, చెరువుల పండగ మరియు ఇతర కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించాలని, కార్యక్రమానికి వచ్చే వారికి పౌరసరఫరాల శాఖ భోజన ఏర్పాట్లను చేయాలని, కార్యక్రమాల గురించి ప్రజలకు తెలియజేయాలని, ప్రభుత్వ కార్యాలయాలలో లైటింగ్, దశాబ్ది ఉత్సవాల లోగోను ఏర్పాటు చేయాలని తెలిపారు. కార్యక్రమాల నిర్వహణలో ఎవరైన నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జి.వి. శ్యాంప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, ట్రైని కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో, సర్వే ఆండ్ లాండ్ రికార్డ్ శాఖ అధికారి అశోక్, ఎలక్ట్రిసిటీ ఎస్ఈ గంగాధర్, మున్సిపల్ కమీషనర్ సేవాఇస్లావత్, వివిధ శాఖ ల అధికారులు, తహసీల్దార్లు పాల్గోన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News