Friday, September 20, 2024
HomeతెలంగాణKarimnagar: నిన్నటి వరకూ ఓనర్ల దగ్గర కూలీలు, నేడు వారే ఓనర్లు

Karimnagar: నిన్నటి వరకూ ఓనర్ల దగ్గర కూలీలు, నేడు వారే ఓనర్లు

దళితులను సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఉన్నత స్థానానికి ఎదిగెలా చేసిన దళితబంఝు పథకం భవిష్యత్తు తరాలలో వెలుగులు నింపనున్నదని మంత్రి గంగుల కమాలకర్ అన్నారు.  దళితబంధు పథకం ద్వారా లబ్ది పొంది ఉత్తమ పారిశ్రామికవేత్తలుగా ఎదిగిన లబ్దిదారులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి మంత్రి గంగుల హాజరయ్యారు.  ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ఆవిర్బావానికి పూర్వం దళితుల జీవితాలను సామాజికంగా, ఆర్థికంగా రాజకీయంగా అభివృద్ది పరుస్తామనే మాటలు మాత్రమే వినపడేవని, దళితులు అప్పు కోసం వెలితే కుదువ పెట్టడానికి ఎదైన ఆస్థిగాని, పూచికత్తు గాని లేకపోతే అప్పుపుట్టెది కాదని గుర్తుచేశారు.  తెలంగాణ ఆవిర్బావం అనంతరం డా. బి.ఆర్. అంబేడ్కర్ కన్న కలలను సాకారం చేయాలని, దళితుల జీవితాలను ఉన్నస్థానం నుండి ఉన్నతస్థానికి ఒక్కసారిగా మార్చివేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపాలనే సదుద్దేశంతో, యావత్ భారతదేశంలో ఎక్కడా మచ్చుకైన చూద్దామంటె కనబడని విధంగా దళితబందు పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రవేశపెట్టి, పథకాన్ని మొదటగా హుజురాబాద్ నియోజకవర్గంలో పైలెట్ ప్రాజెక్టుగా అమలు చేశారన్నారు.  ఎటువంటి పూచికత్తుగాని, ఆస్థిపత్రాలుగాని తిరిగి చెల్లించాల్సిన అవసరం లేకుండా దళితబందు పథకాన్ని రూపొందించారన్నారు.  ఈ పథకం ద్వారా నిన్నటి వరకు క్లీనర్లు డ్రైవర్లుగా, కూలీలుగా ఒకరిదగ్గర పనిచేసిన వాళ్లు ఇప్పుడు యజమానులుగా ఎదిగారన్నారు.  ఇప్పటికే హుజురాబాద్ నియోజక వర్గంలో  లబ్దిదారులకు 100 శాతం పథకాన్ని వర్తింపజేసి యూనిట్లను మంజూరు చేయడం జరిగిందని అన్నారు.  పథకం కొరకు తెల్లరేషన్ కార్డు ఉంటే చాలని,  తెల్లరేషన్ కార్డు ఎ నియోజక వర్గం నుండైతె ఉందో అక్కడినుండే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 

- Advertisement -

             ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్, జిల్లా పరిషత్ చైర్మన్ కనుమల్ల విజయ, నగర మేయర్ వై. సునీల్ రావు, రాష్ట్ర ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, సుడా చైర్మన్ జి.వి. రామకృష్ణ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనీల్ కమార్, ఎఫ్ డి సి చైర్మన్ అనిల్, అదనపు  కలెక్టర్లు జి.వి. శ్యాంప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, జట్పీసీఈఓ ప్రియాంక, జమ్మికుంట మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వర్ రావు, హుజురాబాద్ ఆర్డిఓ హరిసింగ్, శిక్షణ కలెక్టర్ లెనిన్ ఇతర ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News