కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్ర గ్రామానికి ఇటీవల గ్రామ పంచాయతీల సుపరిపాలన రాష్ట్రస్థాయి అవార్డు వచ్చినందుకుగాను ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం తిమ్మాపూర్ మండల గౌరవ అధ్యక్షులు బొర్ర రవీందర్, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు నగునూరు వంశీ ఆధ్వర్యంలో తిమ్మాపూర్ సర్పంచ్ దుండ్ర నీలమ్మ-రాజయ్య దంపతులతో పాటు పాలకవర్గాన్ని, సిబ్బందిని ఘనంగా సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ సీనియర్ నాయకులు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి, బిఆర్ఎస్ మండల మాజీ అధ్యక్షులు దుండ్ర రాజయ్య, బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు పోతురాజుల దేవేందర్, మండల యూత్ అధ్యక్షులు మాదన రాజేందర్, రైతు సమన్వయ సమితి ఎడ్ల బుచ్చిరెడ్డి, నగునూరి బాబు, నగునూరి రాజు, మాతంగి రాజు, మాతంగి అంజయ్య, బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అంబేద్కర్ సంఘం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.