Friday, April 4, 2025
HomeతెలంగాణKarimnagar: ఆర్టీసీ కార్మికుల సంబరాలు, KCRకు పాలాభిషేకం

Karimnagar: ఆర్టీసీ కార్మికుల సంబరాలు, KCRకు పాలాభిషేకం

అంబరాన్నంటిన ఆర్టీసీ ఉద్యోగుల సంబరాలు

కరీంనగర్ లో ఆర్టీసీ కార్మికుల సంబరాలు అంబరాన్నంటేలా సాగాయి. సీఎం కేసీఆర్, మంత్రి గంగుల చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ.. ఆర్టీసీ 1 డిపో నుండి తెలంగాణ చౌక్ వరకు బస్సులకు సీఎం కేసీఆర్ మంత్రి గంగుల కటౌట్లతో భారీ ర్యాలీ చేపట్టారు ఆర్టీసీ ఉద్యోగులు. పటాకులు కాల్చి స్వీట్లు పంచుకుని సంబరాలు నిర్వహించిన కార్మికులు, రాష్ట్ర క్యాబినెట్ కీలక నిర్ణయంతో ఆర్టీసీ కార్మికులు కరీంనగర్ లో సంబరాలు మిన్నంటాయి.

- Advertisement -

టిఎస్ఆర్ టి సి ప్రభుత్వంలో విలీనం చేయడంతో కార్మికుల సంబరాలు అంబరాన్ని అంటాయి.. కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్ వన్ డిపో ముందు కార్మికులు సీట్లు పంచుకొని పటాకులు కాల్చి సంబరాలు నిర్వహించుకున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News