కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల సదస్సుకు సంబంధించిన
వాల్ పోస్టర్ను తెలంగాణ ఉద్యమకారులు ఎడ్ల జోగి రెడ్డి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎడ్ల జోగి రెడ్డి మాట్లాడుతూ… హైదరాబాదులోని ఇందిరా పార్క్ వద్ద వచ్చే నెల (ఆగస్టు) 20వ తారీకున తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం ఆధ్వర్యంలో ఆత్మగౌరవ సదస్సు పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఈ సదస్సులో పలు పార్టీలు, ప్రజా సంఘాల నాయకులతో పాటు అన్ని జిల్లాలు, మండలాల నుండి ఉద్యమకారులు భారీగా తరలిరానున్నారు, తిమ్మాపూర్ మండలంలోని ఉద్యమకారులంతా తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సుకు భారీగా తరలి రావాలని, సదస్సును విజయవంతం చేయాలని కోరారు. అనంతరం జిల్లా అధ్యక్షులు కనకం కుమారస్వామి, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ.. 2001 నుండి తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు పోరాడినటువంటి తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని వారికి స్వాతంత్ర సమరయోధులుగా గుర్తించి ప్రతి నెలా పెన్షన్ తో పాటు ప్రభుత్వ పథకాల్లో వాటా, ఉచిత బస్సు పాసు, ఆరోగ్య కార్డులు, అన్ని రంగాల్లో తగిన ప్రాధాన్యత కల్పించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా ఆగస్టు 20వ తేదీ నాడు ఇందిరాపార్కు వద్ద ఏర్పాటు చేస్తున్న ఉద్యమకారుల సదస్సుకు మండలం నుండి జిల్లా నుండి అత్య ధికంగా ఉద్యమకారులు హాజరై ఈ సదస్సును విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల తెలంగాణ ఉద్యమకారులు ప్రసాద్, మామిడి మొగిలి, తమ్మినవేని నరసయ్య, మామిడి వెంకన్న, గంగిపల్లి శంకర్, దొంగల కనక య్య, కూనమల్ల మల్లేశం, తదితరులు పాల్గొన్నారు.
Karimnagar: ఉద్యమకారుల ఆత్మగౌరవ సదస్సును విజయవంతం చేయండి
ప్రతి నెలా పెన్షన్ తో పాటు ప్రభుత్వ పథకాల్లో వాటా...