కరీంనగర్ పార్లమెంటు పరిధిలో నరేంద్ర మోదిని మరోసారి ప్రధానమంత్రిగా చూడాలని ఇంటింటి ప్రచారంలో బాగంగా ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ అధ్యక్షులు ఆక్షశ్రీ శ్రీనివాసానంద స్వామి, సిద్దిపేట వీరధర్మజ పీఠాధి పతి అత్రిశ్రీ వీర ధర్మజ స్వామి శ్రీ జాన్ యోగీశ్వర పీఠాధిపతి సురేశ్వర నంద స్వామి- కరీంనగర్, దత్త పీఠాధిపతి సల్య నారాయణ స్వామి ఔనరకొండు దేశం ధర్మం బాగుండాలంటే మరోసారి నరేంద్ర మోది ప్రభుత్వం అధికారంలోకి రావాలని కోరారు.
మనదేశం వైపు ప్రపంచ దేశాలు చూస్తున్నాయని, ప్రతీ ఓటరూ మళ్ళీ కరీంనగర్ లో బండి సంజయ్ ని అఖండ మెజారిటీతో గెలిపించాలని నియోజక వర్గ ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ వాస్తవ్యులు ప్రముఖ వాస్తు సిద్దాంతి మామిడి, సత్యనారాయణ దళిత దంపతులకు పాలతో కాళ్ళు కడిగి దళిత బందువులకు మోడి గురించి వివరించి ధర్మాన్ని గెలిపించాలని కోరారు. అయోధ్య రామమందిర నిర్మాణం మోడీ వల్లనే సాధ్యం అయిుందని, రామున్ని కించపరిచి మాట్లాడు పార్టీలకు గుణపాఠం చెప్పాలని కోరారు.