దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు, పది లక్షల రూపాయల విరాళాన్ని అందించారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసి ప్రచారంలో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని కుటుంబ సమేతంగా సందర్శించి పూజలు నిర్వహించి కోడె మొక్కులు చెల్లించుకున్నారు.
- Advertisement -
తాను దేవస్థానానికి ఉడతా భక్తిగా 10 లక్షల రూపాయలు విరాళాన్ని అందిస్తానని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం ఈ మేరకు మంగళవారం రోజున వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని సందర్శించి ఆలయ అధికారులకు 10 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు.