కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఓటర్ల జాబితాను సవరించుట కొరకు మార్పులు, చేర్పుల ప్రక్రియ నిరంతరం జరుగుతుందని, మార్పుల ప్రక్రియలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు సహకరించాలని సూచించారు. ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఈవియం ఎఫ్ఎల్ సి నిర్వహించాలన్నారు. అసెంబ్లి నియోజక వర్గస్థాయి ఈఆర్ఓలు రాజకీయ పార్టీల నుండి వచ్చే ఫిర్యాదులపై ప్రతివారం చర్యలు తీసుకోవాలని సూచించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో బూత్ లెవల్ ఎజెంట్లను నియమించాలని, ఇదివరకే ఏర్పాటు చేసిన వారిలో మార్పులు ఉన్నట్లయితే తెలియజేయాలని అన్నారు. అర్హులైన ట్రాన్స్ జెండర్లను ఓటర్లుగా నమోదు చేయాలని, ఓటరు జాబితాను అధికారులతో పాటు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పరిశీలించి ఎమైన మార్పులు ఉన్నట్లయితే తెలియజేయాలన్నారు. ఈవియం లను ఈఆర్ఓ లు, ఎఈఆర్ఓ లు ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు జి.వి. శ్యాంప్రసాద్ లాల్, గరిమా అగర్వాల్, శిక్షణ సంయుక్త కలెక్టర్ నవీన్ నికోలస్, జట్పి సిఈఓ ప్రియాంక, కరీంనగర్, హుజురాబాద్ ఆర్డిఓలు ఆనంద్ కమార్, హరిసింగ్, డిఆర్డిఓ శ్రీలత, డిపిఓ వీరబుచ్చయ్య, బిఎస్పి పార్టీ ప్రతినిధి అనీల్ కుమార్, బిజెపి పార్టీ ప్రతినిధి రమణ రెడ్డి, సిపిఐ పార్టీ ప్రతినిది సురేందర్ రెడ్డి, బిఆర్ఎస్ ప్రతినిది సత్తనేని శ్రీనివాస్, సిపిఐ (యం) ప్రతినిది వాసుదేవ రెడ్డి, కాంగ్రెస్ ప్రతినిది మోహన్ చారి, ఇతర పార్టీల పాల్గొన్నారు.