కౌడిపల్లి మండల వ్యాప్తంగా ఆయా గ్రామాలలో పార్టీ గ్రామ అధ్యక్షులు 22వ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని బిఆర్ఎస్ జెండా ఆవిష్కరణ చేసి, ప్లీనరీ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రమైన కౌడిపల్లి గ్రామంలో పంచాయతీ కార్యాలయ సమీపంలో టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు సారా రామగౌడ్, యూత్ అధ్యక్షులు చంద్రం కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో టిఆర్ఎస్ జండా ఆవిష్కరణ చేసి తల్లి తెలంగాణ గేయం ఆలపించి తోటి ప్రజా ప్రతినిధులకు కార్యకర్తలకు సీట్లు పంపిణీ చేసి ప్లీనరీ ఉత్సవాలన్నీ ఆనంద ఉత్సవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు సారామ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు దేశంలోని ఏ రాష్ట్రంలో లేవని దేశానికి ఆదర్శ రాష్ట్రంగా తయారు చేసిన సీఎం కేసీఆర్ ముచ్చటగా మూడవసారి తెలంగాణ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించుకు తీరుతారని ఆయన దోషం చెప్పారు. అలాగే మచ్చలేని మహారాజు మన నర్సాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ రెడ్డిని లక్ష మెజార్టీతో గెలిపించి మూడోసారి ఎమ్మెల్యేగా పదవి బాధ్యతలు చేపట్టే విధంగా చేస్తారని ఆయన హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రాజు నాయక్, మండల కో ఆప్షన్ నెంబర్ మహ్మద్ హైమద్, మహ్మద్ నగర్ సొసైటీ వైస్ చైర్మన్ చిలుముల చిన్నంరెడ్డి, జిల్లా ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి కౌడ శ్రీనివాసు గుప్తా, నాయకులు చిలుముల రాజు రెడ్డి, మాటూరి శాఖయ్య, ముదిరాజ్ సంఘం అధ్యక్షులు బుజగంపేట మల్లేశం, గౌడిచర్ల పాండు, అమర్ సింగ్, డాక్టర్ పురుషోత్తం, కుర్మ లక్ష్మణ్, దర్శి చంద్రం, సత్యనారాయణ, మోతిలాల్ గౌడ్, సంతోష్, కౌడిపల్లి ముదిరాజ్ సంఘం గౌరవ సలహాదారులు భుజరంపేట ఎల్లం, సత్తయ్య, జగన్, తిరుమలేష్ లతోపాటు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
లింగంపల్లి లో..
22వ టిఆర్ఎస్ ప్లీనరీ ఉత్సవాల్లో భాగంగా మండలంలోని లింగంపల్లి గ్రామంలో ప్లీనరీ ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నారు. గ్రామ అధ్యక్షుడు సంజీవరెడ్డి ఆధ్వర్యంలో జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాధవరెడ్డి, నాయకులు గొల్ల మల్లేశం, సుధాకర్, గొల్ల బాలయ్య, గొల్ల కొమురయ్య, ప్రవీణ్, కిషన్ తదితరులు పాల్గొన్నారు.