ఇరువై ఏళ్లుగా సొంతింటి నిర్మాణానికి స్థలాల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న నిరుపేదల కలను రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి నెరవేర్చారు.. జమ్మికుంట మండలం సైదాబాద్ గ్రామంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి లాటరీ ద్వారా నిరుపేదలైన లబ్ధిదారులకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… ఇరువై సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎనిమిది సంవత్సరాలు మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ సమస్యను పరిష్కరించ లేక పోయాడని తాను ఎమ్మెల్సీగా వచ్చిన సంవత్సరంలోనే అర్హులందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలందరూ ఆదరించి ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పుప్పాల శైలజ రాజారం, జడ్పిటిసి సభ్యుడు శ్రీరామ్ శ్యామ్, జమ్మికుంట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పోల్నేని సత్యనారాయణ రావు, జమ్మికుంట మున్సిపాలిటీ మాజీ చైర్మన్ పోడేటి రామస్వామి, తాహసిల్దార్ రజని, సిఐ రమేష్, ఆర్ఐలు తిరుపతి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.