ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ జర్నలిస్టుల విషయంలో మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ పట్టణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ…
మంత్రిగా ఉన్నప్పుడు ఈటల హుజురాబాద్ లో జర్నలిస్టులకు ఎందుకు ఇళ్ల స్థలాలు ఇవ్వలేదని ప్రశ్నించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈటల ఒక్కడే మంత్రిగా ఉన్నప్పుడు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయించకపోవడానికి గల కారణానికి సమాధానం చెప్పాలన్నారు. అహర్నిశలు వార్త సేకరణపై దృష్టి సారించే జర్నలిస్టుల జీవితాలు బాధాకరమన్నారు. ఈటల వ్యవహారం దొంగే దొంగ అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. హుజురాబాద్ లో అతిత్వరలో జర్నలిస్టుల కు ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ని చీట్ చేసిన వ్యక్తి ఈటల అని అన్నారు. ఈటల బ్లాక్ మెయిల్ చేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్పించి పదవి ఇప్పించుకున్నాడని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Kaushik Reddy: ఈటల మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి
జర్నలిస్టుల జీవితాలు బాధాకరం