Tuesday, September 17, 2024
HomeతెలంగాణKaushik Reddy: ఈటల బీఆర్ఎస్ లోకి వస్తాడేమో!

Kaushik Reddy: ఈటల బీఆర్ఎస్ లోకి వస్తాడేమో!

ఈటెల కాంగ్రెస్ లోకి వెళ్తారో, బీఆర్ఎస్ లోకి వస్తారో!

ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ అనేక అసత్య ఆరోపణలు చేశారని, ఇద్దరు ముగ్గురు ఈటెల రాజేందర్ మీడియా బ్రోకర్లు నా పైన, సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు పైనా కట్టు కథలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు కౌశిక్ రెడ్డి. కొన్ని యూ ట్యూబ్ చానళ్ళు పని గట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నారని, .ఓ యూ ట్యూబ్ ఛానల్ కెమెరా మన్ ను బంధించానని, కులం పేరుతో దూషించానని తప్పుడు ప్రచారం చేశారని, ఆ కెమరామెన్ మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్లారని, సీసీ టీవీ ఫుటేజ్ లో ఉందని కౌశిక్ రెడ్డి వివరిస్తూ, మీడియాకు ఫుటేజ్ చూపించారు.
ఈటెల రాజేందర్ బీసీ దొరలా వ్యవహరిస్తున్నారని, నేను ముదిరాజ్ లకు వ్యతిరేకం అని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఈటెల సొంత ఊర్లో నేను ముదిరాజ్ లకు ఎక్కువ చేశానా ఈటెల మేలు చేశారో తేల్చుకోవడానికి బహిరంగ చర్చకు సిద్ధమన్నారు కౌశిక్. నేను ఏ ఒక్కరిని కులం పేరుతో దూషించ లేదని, ఈటల స్థాయి కన్నా నా స్థాయి ఎక్కువేనని, స్థాయి తక్కువ అని చర్చ నుంచి పారిపోవద్దని హెచ్చరించారు.

- Advertisement -

ప్రతి సర్వే హుజురాబాద్ లో బీ ఆర్ ఎస్ గెలుస్తుందని చెబుతోందని, బీఆర్ ఎస్ ను ఎందుకు వీడానా అని ఈటెల ప్రతి రొజూ మధన పడుతున్నారని, ఈటెల కాంగ్రెస్ లోకి వెళ్తారో, బీఆర్ఎస్ లోకి వస్తారో తెలియదన్నారు ఆయన. అసహనంతో ఈటెల సైకోగా మారారని, ఈసారి ఈటెలకు డిపాజిట్ కూడా దక్కదు రాసి పెట్టుకోండంటూ మీడియాతో కౌశిక్ అన్నారు. …ఈటెల కన్నా సీనియర్ ఉద్యమకారుడు మా నాన్న సాయినాథ్ రెడ్డే, హుజురాబాద్ లోని మా ఇంట్లో టీ ఆర్ ఎస్ జెండా పుట్టిందనన్నారు ఆయన.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News