హుజురాబాద్ నియోజకవర్గం పరిధిలో గత వారం రోజులుగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను నేరుగా ఇళ్ల వద్దకే వెళ్లి పంపిణీ చేస్తున్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి ఎక్కడ చూసిన విశేష స్పందన లభిస్తోంది. చెక్కుల పంపిణీ సమయంలో కనిపిస్తున్న ప్రతి ఒక్కరినీ పేరుపేరునా ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగుతూ ఉండడం బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది. జమ్మికుంట మండలం కోరపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని కాపులపల్లికి చెక్కుల పంపిణీ చేసేందుకు మధ్యాహ్నం వెళ్తున్న సమయంలో వ్యవసాయ పనులు చేస్తున్న కూలీలు వారు తెచ్చుకున్న సద్దన్నం తింటున్నారు. ఆదే సమయంలో అటుగా వెళుతున్న కౌశిక్ రెడ్డి వారిని చూసి వారి వద్దకు వెళ్ళి వారితో ప్రభుత్వ సంక్షేమ పథకాలపై కాసేపు ముచ్చటించారు. ఆకలి సమయంలో వచ్చావు బిడ్డా అంటూ పలువురు మహిళలు తాము తెచ్చుకున్న సద్దన్నాన్ని ఆప్యాయంగా ఆయనకు తినిపించడం విశేషం. వ్యవసాయ కూలీలతో పాటు అటువైపుగా వెళ్తున్న పలువురు ప్రయాణికులు సైతం కౌశిక్ రెడ్డి తీరు పై హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి. డాక్టర్ శ్రీరామ్ మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షురాలు కడవేరు మమతతో పాటు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.