Friday, November 22, 2024
HomeతెలంగాణKaushik Reddy: పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం ‌

Kaushik Reddy: పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకుంటాం ‌

వరద తీవ్రతను క్షేత్రస్థాయిలో పరిశీలించిన విప్

ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వ పరంగా ఆదుకునేందుకు అవసరమైన చర్యలు చేపడుతామని రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల వరద ఉధృతితో జమ్మికుంట మండలం విలాసాగర్ మానేరు వాగు చెక్ డ్యాం ధ్వంసం కాగా మంగళవారం ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి కొట్టుకపోయిన చెక్ డామ్ ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
వరద తాకిడికి పంట పొలాలు నష్టపోయిన రైతులు ఆదైర్య పడవద్దని ప్రభుత్వం పంట నష్టాన్ని అధికారులతో సర్వే నిర్వహించి ప్రభుత్వపరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ప్రయోజనాల కోసం నీటిని నిల్వ ఉంచాలనే సదుద్దేశంతో విలాసాగర్ మానేరు వాగుపై రూ,10 కోట్ల వ్యయంతో చెక్ డ్యామ్ నిర్మించడం జరిగిందన్నారు. నీటి ప్రవాహానికి కొట్టుకపోయినా చెక్ డ్యామ్ పరిస్థితిని సంబంధిత ఉన్నతాధికారులకు ఫోన్లో వివరించారు. యుద్ధ ప్రాతిపదికన కొట్టుకపోయినా చెక్ డ్యామ్ పునర్నిర్మాణ పనులు చేపట్టి పూర్తి చేసి నీటి కొరత ఏర్పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ వైస్ చైర్మన్ పింగిలి రమేష్, జమ్మికుంట జడ్పిటిసి సభ్యుడు శ్రీరామ్ శ్యామ్, మున్సిపల్ చైర్మన్ తక్కళ్ళపల్లి రాజేశ్వరరావు, గ్రామ సర్పంచ్ పింగళి రమాదేవి, ఉప సర్పంచ్ సిరిసేటి అశోక్, పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News