Sunday, July 7, 2024
HomeతెలంగాణKavitha: సీబీఐ విచారణ ఉత్కంఠ.. కవిత ఇంటి వద్ద భారీగా పోలీసులు

Kavitha: సీబీఐ విచారణ ఉత్కంఠ.. కవిత ఇంటి వద్ద భారీగా పోలీసులు

- Advertisement -

Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణకు సంబంధించి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవిత ఇంటికి చేరుకోనున్నారు. ఆమె వాయిస్ ను రికార్డు చేయనున్నారు. సీఆర్పీసీ 160 కింద కవితకు ఇప్పటికే సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై నమోదైన కేసు విచారణలో భాగంగా.. మద్యం పాలసీకి సంబంధించి కవిత దగ్గర ఏదైనా సమాచారం ఉందా అనే కోణంలో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించనున్నారు.

కవిత ఇప్పటికే ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కూడా కలవగా.. మరోవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా ఆమె ఇంటికి చేరుకుంటున్నారు. ఒకవైపు కార్యకర్తలు కవిత ఇంటికి చేరుకుంటుండడంతో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర బలగాల పర్యవేక్షణలో ఈ సీబీఐ వివరణ తీసుకోనుంది. ఇదిలా ఉంటే మరోవైపు సీబీఐ విచారణ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఇంటి దగ్గర ఏర్పాటైన ఫ్లెక్సీలు ఆసక్తిగా మారాయి. ‘డాటర్‌ ఆఫ్‌ ఫైటర్‌ విల్‌ నెవర్‌ ఫియర్‌’ అంటూ ఫ్లెక్సీలను టీఆర్‌ఎస్‌ నేతలు ఏర్పాటు చేశారు. వీరుని కుమార్తె ఎప్పటికీ భయపడదు అనే క్యాప్షన్ తో వెలసిన బ్యానర్లు హల్ చల్ చేస్తున్నాయి.

కవిత ఇంటికి వచ్చిన సీబీఐ అధికారులు కేవలం ఆమె వద్ద నుండి స్టేట్మెంట్ వరకే రికార్డ్ చేసుకొని వెళ్తారా.. మరేమైనా పరిణామాలు జరగనున్నాయా అన్న ఉత్కంఠ నెలకొంది. ఇక, శనివారం కవిత కేసీఆర్‌ను కలుసుకోగా.. వీరి మధ్య ఏ అంశాలపై చర్చ జరిగిందనేది ఆసక్తిగా మారింది. నిజానికి కవిత సీబీఐ అధికారుల ముందు ఈ నెల 6వ తేదీనే హాజరు కావాల్సి ఉంది. కానీ ఆ రోజు కవితకు వేరే కార్యక్రమాలు ఉండటంతో.. అందుబాటులో ఉండలేనంటూ సీబీఐకి లేఖ రాశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News