Thursday, January 30, 2025
HomeతెలంగాణKavitha: పొంగులేటి క్షమాపణలు చెప్పాలి.. కవిత డిమాండ్

Kavitha: పొంగులేటి క్షమాపణలు చెప్పాలి.. కవిత డిమాండ్

కరీనంగర్ మహిళా కలెక్టర్‌ని బహిరంగంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి(Ponguleti Srinivas Reddy) అవమానించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఇది కాంగ్రెస్‌ నాయకుల అహంకారానికి పరాకాష్ఠ అని ఆమె మండిపడ్డారు. ఇలాంటి సిగ్గుమాలిన వైఖరి ఆమోదయోగ్యం కాదన్నారు. ఇది కేవలం కలెక్టర్‌ను అవమానించడమే కాదని.. మొత్తం అధికార యంత్రాంగాన్నే అవమానించడమని పేర్కొన్నారు.

- Advertisement -

ఇటువంటి చర్యలు పాలన వైఫల్యాన్ని ప్రతిబింబిస్తాయన్నారు. మహిళా కలెక్టర్‌కు తాము అండగా ఉంటామని తెలిపారు. ఈ ఘటనపై మంత్రితో పాటు కాంగ్రెస్ పార్టీ కలెక్టర్‌కు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా శుక్రవారం కరీంనగర్ జిల్లాలో కేంద్రమంత్రుల పర్యటనలో భాగంగా కలెక్టర్ పమేలా సత్పతిపై మంత్రి పొంగులేటి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News