Saturday, November 15, 2025
Homeతెలంగాణmlc kavitha hot comments :ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు... కాళేశ్వరం అవినీతిలో హరీశ్‌రావు పాత్ర...

mlc kavitha hot comments :ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు… కాళేశ్వరం అవినీతిలో హరీశ్‌రావు పాత్ర ఉంది.

mlc kavitha comments on harish rao: బీఆర్ ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు పై
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం అవినీతిలో హరీశ్‌రావు పాత్ర ఉందని ఆరోపించారు. హరీశ్‌రావు , సంతోష్ వల్లే కేసీఆర్ పై నిందలు వస్తున్నాయని అన్నారు. హరీశ్‌రావు , సంతోష్ రావు వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని ఆరోపించారు.

- Advertisement -

నా కడుపు రగిలిపోతుంది: కేసీఆర్ పైన పెద్ద ఎత్తున కుట్ర జరుగుతుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మా నన్న మీద సీబీఐ ఎంక్వైరీ వేయడంతో కడుపు రగులిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్ పక్కన వాళ్లలో ఉన్న కొంత మందితోనే ఇలా జరిగిందని అన్నారు. ఇదంతా హరీశ్‌రావు వల్లే జరిగిందని ఆరోపించారు. అందుకే హరీష్‌ను ఇరిగేషన్‌ మంత్రిగా తొలగించారని అన్నారు. వాళ్ల స్వార్థం కోసమే అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. దమ్ముంటే హరీష్‌, సంతోష్‌పై చర్యలు తీసుకోవాలని అన్నారు. కేసీఆర్‌పై ఆరోపణలు తట్టుకోలేకపోతున్నానని తెలిపారు. కేసీఆర్ పై సీబీఐ కేసులు పెట్టేస్థాయికి వచ్చాక పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత అని అన్నారు. నాపై పిచ్చివాగుడు వాగితే తోలుతీస్తానని ఎమ్మెల్సీ కవిత అన్నారు.

ఆ ముగ్గురు వల్లే కేసీఆర్‌కు చెడ్డపేరు: కాళేశ్వరం ప్రాజెక్టులో చిన్న భాగం కుంగితే మొత్తం ప్రాజెక్టు పోయినట్టా అని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. కాళేశ్వరం అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆమె స్పందించారు. ఎవరి వల్ల, ఎందుకోసం కేసీఆర్‌కు అవినీతి మరక అంటిందో గుర్తించాలని అన్నారు. కాళేశ్వరం విషయంలో ఐదేళ్లు ఇరిగేషన్‌ మంత్రిగా ఉన్న హరీశ్‌రావు పాత్ర ఉందని ఆరోపించారు. మాజీ ఎంపీ సంతోష్‌ కుమార్, హరీశ్‌రావు, మేఘా ఇంజినీరింగ్ వల్లే కేసీఆర్‌కు చెడ్డపేరు వచ్చిందని కవిత ఆరోపించారు. మా నాన్నకు తిండి , డబ్బు మీద యావ ఉండదని అన్నారు. తరతరాలకు తరగని ఆస్తిని కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చారని అన్నారు.

కవిత గతంలో చెప్పి న దెయ్యాలెవరో తేలిపోయింది: ఎమ్మెల్సీ కవిత చేసిన ఆరోపణలపై కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి స్పందించారు. కవిత గతంలో చెప్పిన దెయ్యాలెవరో తేలిపోయిందని అన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందన్నది కూడా ప్రజలకు క్లారిటీ వచ్చిందని పేర్కొన్నారు. కవితతో ఎవరో మాట్లాడిస్తారని అనుకోవడం లేదని మల్లు రవి పేర్కొన్నారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ప్రధాన మంత్రి మోదీ కూడా చెప్పారని అన్నారు. కేంద్రబృందం మొత్తం అవినీతిని నిర్థారించడంతోనే కాళేశ్వరంపై సీబీఐ విచారణ కోరినట్లుగా మల్లురవి పేర్కొన్నారు. హరీశ్‌రావు వెనుక సీఎం రేవంత్‌ రెడ్డి ఉన్నారని కవిత చేసిన వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయని అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad