గత పది సంవత్సరాల పాటు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కొనసాగించిన బిఆర్ఎస్ పార్టీ అవినీతి అక్రమాలతో పాటు విపరీతమైన దోపిడీకి పాల్పడిందని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు . శంకరపట్నం మండలంలోని తాడికల్, ముత్తారం, గడ్డపాక గ్రామాలలో యాదవ సంఘ భవనం ప్రారంభోత్సవం, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా గద్దపాక గ్రామంలో జరిగిన సమావేశంలో కవ్వంపల్లి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్ తనకే అన్ని తెలుసని ప్రభుత్వ అధికారులను సైతం పక్కనపెట్టి తాను ఏం చేయాలో అది చేసుకుని దోపిడీకి పాల్పడ్డారని ఆయన ఆరోపించారు. పదేళ్లపాటు టిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో చేసిన అభివృద్ధి పనులు ఏమాత్రం గ్రామాలలో ఖానా రావడంలేదని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన అనంతరం గ్రామాలకు వెళుతున్న ప్రజాప్రతినిధులకు సమస్యల తోరణాలను గ్రామస్తులు వినిపిస్తున్నారన్నారు ఇన్నేళ్లపాటు తెలంగాణను ఏలిన బిఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి అక్రమాలకు కుటుంబ పాలనకు అక్కెర రాణి పనులకు ప్రాధాన్యతనిస్తూ సంపాదన ధ్యేయంగా ముందుకెళ్లినారని ఒక్కొక్కటి నేడు బయటపడుతున్నాయని వాటిపై ప్రభుత్వం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకునేందుకు వెనకాడ బోదని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా బిజెపి భారతదేశంలో వివిధ కులాల మధ్య చిచ్చులు రేపుతూ ఏదో విధంగా అధికారం చేపట్టాలని తహతలాడుతుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ చేసిన అభివృద్ధి పని ఏమిటో చూపించాలని ఆయన అన్నారు. ఏనాడు కూడా గ్రామాలు పర్యటించని ఎంపీ బండి సంజయ్ నేడు మనకు దైవభక్తిపై నేర్పుతున్నట్లుగా వివరిస్తున్నాడని తమకు గతంలో దైవభక్తి పట్ల రాముడి పట్ల విశ్వాసం లేదా అన్న చందంగా వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. రాముడు అందరికీ దేవుడేనని అన్నారు.
ఎన్నికల సమయంలో ఏదో ఒక సాకును చూపుతూ బిజెపి ప్రజల ముందుకు వస్తుందని అట్టి పార్టీని తిప్పి కొట్టాలని ఆయన కోరారు . రామరాజ్యం సాధ్యం కావాలంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అవుతుందని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతున్నామని నేడు తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఎంతో అభివృద్ధితో పాటు నిరుద్యోగులను ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ అక్కున చేర్చుకుంటున్నామన్నారు . కాంగ్రెస్ ప్రభుత్వం రానున్న రోజుల్లో అభివృద్ధి చేసి చూపుతుందని రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి అభివృద్ధి బాటలు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. వివిధ సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చారని అట్టి సమస్యల పరిష్కారానికి తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన గ్రామస్తులకు హామీ ఇచ్చారు. గృహజ్యోతి పథకానికి అర్హులైన వారికి ఎమ్మెల్యే కవ్వంపల్లి జీరో బిల్లులను అందజేశారు.
ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయండి ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు ఏర్పడినట్లయితే వాటిని త్వరగా పూర్తి చేయాలని కాలయాపన చేయరాదని ఎవరికైనా కాలయాపన చేసే ఆలోచన ఉన్నట్లయితే తక్షణమే శంకరపట్నం మండలం నుండి వెళ్లిపోవాలని, పని చేయాలనే తపన ఉన్న అధికారులు మాత్రమే తన నియోజకవర్గంలో పని చేయాలని ఆయన ఆముదాలపల్లి విద్యుత్ శాఖ ఏఈ కుమారస్వామి తో అన్నారు. విద్యుత్ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లడంతో విద్యుత్ శాఖ ఏఈ ని ఎమ్మెల్యే మందలించారు.
ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గోపగోని బసవయ్య గౌడ్ , మాజీ జెడ్పిటిసి శ్రీనివాస్ గౌడ్, ఎంపీడీవో నల్ల శ్రీవాణి, ప్రత్యేక అధికారి రాచకొండ శ్రీనివాస్, విద్యుత్ శాఖ లైన్మెన్ చింతిరెడ్డి రవీందర్ రెడ్డి , పంచాయతీ కార్యదర్శి, మాజీ సర్పంచ్ పల్లె పాపిరెడ్డి, మాజీ ఎంపీటీసీ రహీం, ఆరిఫ్, అరిగే ప్రభాకర్, మారవేణి రాజయ్య, నిలవేణి బుచ్చయ్య, గాజుల మహేష్, రాయిని రమేష్, రెడ్డి పవన్ , కాటం రవీందర్ రెడ్డి , మాజీ ఉపసర్పంచులు కన్నబోయిన జంపయ్య, ఆడితం కుమార్, గ్రామ ప్రజలు , కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.