ఆత్మకూరు మండల కేంద్రంలో కేసీఆర్ ఫోటోకు పాలాభిషేకం చేపట్టారు. రైతులకు ఇచ్చిన హామీ నెరవేర్చే క్రమంలో లక్ష రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్బంగా మండలంలోని వివిధ గ్రామాల నుండి తరలి వచ్చిన రైతులు, BRS పార్టీ నాయకులు, BRS పార్టీ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి మెయిన్ రోడ్ చౌరస్తా వద్ద కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు, నిరంతరం రైతుల క్షేమాన్ని కోరుతూ ముందుకు సాగుతున్న కెసిఆర్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు, ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా విచ్చేసిన జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కొల్పుల అమరేందర్ మాట్లాడుతూ రైతు పక్షపాతి అయిన మన కెసిఆర్ కి, BRS పార్టీకి మనందరం వెన్నుదన్నుగా ఉండాలని స్వయంగా రైతు అయిన కెసిఆర్ సారథ్యంలో ముందుకు సాగాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో BRS మండల పార్టీ అధ్యక్షులు బీసు చందర్ గౌడ్, రైతు సమన్వయ సమితి మండల కో ఆర్డినేటర్ యాస ఇంద్రారెడ్డి, జిల్లా రైతు బంధు సమితి డైరెక్టర్ కోరే బిక్షపతి, వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్లు, గడ్డం దశరథ గౌడ్, కొంగరి ఎల్లయ్య, సర్పంచులు, భాషబోయిన ఉప్పలయ్య, లగ్గాని రమేష్ గౌడ్, నాయిని నర్సింహా రెడ్డి , కోలా సత్తయ్య , శ్రీనివాస్ రెడ్డి, ఆకుల ముత్యేం, మండల నాయకులు, కాంబోజు భాను ప్రకాష్, బూడిద శేఖర్, ఎలాగందుల విజయ్ కుమార్, గంధమల్ల శివ శంకర్, కాలే మల్లేష్, పుట్ట నర్సిరెడ్డి, తొండ పురుషోత్తం రెడ్డి, పల్సం నర్సయ్య, కావటి ఉప్పలయ్య, దంతూరి వెంకటేష్, అజిముద్దీన్, మేడి శ్రీనివాస్, మల్లెల పర్వతాలు ,బబ్బురి రమేష్ గౌడ్, నాతి మల్లిఖార్జున్, యాస అంజి రెడ్డి, సుదగాని లింగయ్య, సామ నరేందర్ రెడ్డి, ఎరకల బాల నర్సయ్య, మేడి వెంకటేష్, యాదమల్లు సుంచు నాగరాజు , గంధమల్ల గణేష్ పాల్గొన్నారు.